Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అంచనాలు పెంచిన ‘తేజ్ ఐలవ్ యూ’ ట్రైలర్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్'. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలై ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రాన్ని జూలై 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సారి దర్శకుడు కరుణాకరన్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యేట్లు కనిపిస్తోంది.
సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాశ్, పవిత్రా లోకేశ్, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్ రవి, అరుణ్ కుమార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్, గోశాల రాంబాబు, స్టంట్స్: వెంకట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సతీశ్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, చీఫ్ కో డైరెక్టర్: చలసాని రామారావు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: సాహి సురేశ్, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్.