'తేజ్ ఐ లవ్ యూ' ట్రైలర్‌పై ప్రశంసల జల్లులు!
సాయిధరమ్ తేజ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ చిత్రం జులై 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవితో ఛాలెంజ్, అభిలాష వంటి అద్భుతమైన చిత్రాలు నిర్మించిన కె ఎస్ రామారావు ఈ చిత్రానికి నిర్మాత.
తాజగా తేజ్ ఐ లవ్ యూ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆధ్యంతం వినోదాత్మకంగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ప్రతి ప్రేముని దర్శకుడు కరుణాకరన్ కలర్ ఫుల్ గా తెరకెక్కించారు. చిత్రంలో హాస్యం కూడా బాగా పండినట్లు తెలుస్తోంది.

ఈ చిత్ర ట్రైలర్ పై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందని వరుణ్ తేజ్ ట్వీట్ చేసాడు. ప్రతి సన్నివేశంలోనూ తేజు తన హావ భావాలతో అదరగొట్టాడని హరీష్ శంకర్ తెలిపాడు. ఇక విన్నర్ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ట్రైలర్ బావుందంటూ ట్వీట్ చేశారు. వరుస పరాజయాల్లో ఉన్న తేజు ఈ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నాడు.


Click it and Unblock the Notifications











