దాసరిని ‘9’ తొక్కేసినట్లు.. తేజాను ‘6’ అల్లాడిస్తుందా?
సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖులు, హీరోలు, హీరోయిన్లు... జాతకాలు, సంఖ్యా శాస్త్రాలపై చాలా నమ్మకం పెట్టుకుంటారు. వాటి ప్రకారం నడుచుకుంటే విజయం తమను వరిస్తుందిన గుడ్డిగా నమ్మేస్తుంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ వారు అనుకున్నట్లు జరుగదు. ఎన్ని జాగత్తలు తీసుకున్నా ఒక్కోసారి బొక్కబోర్లా పడతారు. మేం ఇప్పడు మాట్లాడుతుంది దర్శక రత్న దాసరి నారాయణ రావు, మరో దర్శకుడు తేజ గురించి.
ఈ దర్శకులకు సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం వీరిద్దరికి జాతకాలు, సంఖ్యా శాస్త్రంపై నమ్మకం చాలా ఎక్కువే. ఉదాహరణకు...దాసరి ఆ మధ్య కొత్త మొహాలతో తీసిన 'యంగ్ ఇండియా" సినిమానే తీసుకుంటే అందులో 81 మంది కొత్త ఆర్టిస్టులతో నటింపజేశారు దాసరి. 8 ప్లస్ 1 కలిపితే 9. దాసరి లక్కీ నెంబర్ 9 కాబట్టే అంత మంది కొత్త వారిని తీసుకున్నారని అప్పట్లో చర్చించుకున్నారు. అయితే ఆ సినిమా పరమ ప్లాపుగా నిలిచింది.
తాజాగా దర్శకుడు తేజ చాలా కాలం తర్వాత ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో మొత్తం 42 మంది కొత్త వారిని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాడు. ఖచ్చితంగా 42 మందే ఎందుకంటే తేజ లక్కీ నెంబర్ 6. 4ప్లస్ 2 కలిపితే 6. అదన్నమాట అసలు మ్యాటర్. గతంలో దాసరి 9 అంకెను నమ్మకుంటే ఆ నెంబర్ కాస్త ప్లాపు రూపంలో దాసరి ఇమేజ్ ను పాతాళానికి తొక్కేసింది. మరి తాజాగా ఆరు అంకెను నమ్మకున్న తేజకు ఆ సినిమా కలిసొస్తుందా? లేక దాసరి మాదిరి పరిస్థితి రివర్స్ అవుతుందా? అనే చర్చ సాగుతుంది ఫిల్మ్ నగర్ లో..


Click it and Unblock the Notifications











