twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయిరాం శంకర్‌తో సినిమా వద్దన్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : "సాయిరాం శంకర్‌తో సినిమా అంటే కొంతమంది వద్దన్నారు. మనది ఎవరైనా చెయ్యొద్దంటే చేసే టైపు కాబట్టి ఈ సినిమా చేశా'' అని చెప్పారు దర్శకుడు తేజ. సాయిరాం శంకర్ హీరోగా ఆయన రూపొందిస్తున్న చిత్రం '1000 అబద్ధాలు'. శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఎస్థర్ హీరోయిన్.

    తేజ మాట్లాడుతూ "నేను ఇదివరకు తీసిన 'నిజం' దొబ్బింది కాబట్టి ఇప్పుడు '1000 అబద్ధాలు' తీస్తున్నాడని అనుకుంటున్న వాళ్లున్నారు. ఇది అబద్ధాలాడే ఓ కుర్రాడి కథ. 80 శాతం కామెడీ, 20 శాతం డ్రామా ఉండే 'డ్రామెడీ'. ఐదు పాటలుంటాయి. నిర్మాత సురేశ్‌బాబుకి ఈ సినిమా నచ్చింది. సురేశ్ ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ఎస్థర్‌కు సునీల్ సరసన 'భీమవరం బుల్లోడు'లో నటించే అవకాశం వచ్చింది'' అని చెప్పారు.

    అలాగే ...''పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి '1000 అబద్ధాలు' అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం'' అని చెప్పారు.

    సాయిరాం శంకర్ మాట్లాడుతూ "ఈ సినిమాలో కొంచెం కొత్తగా కనిపిస్తా. కచ్చితంగా మంచి సినిమా అవుతుంది. అనుకున్నది సాధించడానికి వెయ్యి అబద్ధాలాడే యువకునిగా నటించా'' అన్నారు. పెద్ద, చిన్న అనే తేడా చెరిపేసే సినిమా అవుతుందనీ, జూలై ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాత ప్రభాకర్ చెప్పారు. ఈ సినిమా చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్ అని ఎస్థర్ తెలిపారు.

    ఈ చిత్రంలో నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: రమణగోగుల, కెమెరా: రసూల్ ఎల్లోర్, కళ: నరసింహవర్మ, ఎడిటింగ్: శంకర్, పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్. సమర్పణ: చిత్రం మూవీస్, నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.

    English summary
    Senior director Teja who is advertising his new film 1000 Abaddalu as 'A Film Not By Teja'. Call it attention grabbing or clever tactic, this is truly intriguing and evokes our interest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X