Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తేజ కొత్త చిత్రం కోసం స్టార్ హంట్..డిటేల్స్
ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ ''డిసెంబరులో చిత్రీకరణ మొదలుపెడతాం. ఈలోగా నటీనటుల్ని ఎంపిక చేసుకొంటాం. ఆసక్తిగల వారు [email protected] కి ఫొటోల్ని, వీడియోల్ని పంపించవచ్చు'' అన్నారు. ప్రతిభావంతులను అన్వేషించడం, వారితో సినిమాలు చేయడం కోసమే ఈ స్టార్ హంట్ అని చెప్తున్నారు.
ఈ చిత్రం పూర్తి స్ధాయి డ్రామా గా నడవనుందని తెలుస్తోంది. బడ్జెట్ కంట్రోల్ లోనే ఈ చిత్రాన్ని తేజ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. తేజ ఆ మధ్యన వెంకటేష్ తో రెండేళ్లు కష్టపడి సావిత్రి అనే స్క్రిప్టుని రెడీ చేసుకుని ఓకే చేయించుకున్నారు. వైజాగ్ స్టూడియోలో దాని ఓపినింగ్ కూడా జరిగింది. అయితే అనుకోని విధంగా సురేష్ బాబు ఆ ప్రాజెక్టుని ఆపు చేసేసారు. అయితే ఇప్పుడు ఈ రకంగా కొత్తవారితో ముందుకు వస్తున్నారు.
ఇక గతంలో తేజ మీడియాతో మాట్లాడుతూ.. స్టార్స్‌ని నేను హేండిల్ చేయలేను. వాళ్ల ఇమేజ్ కోసం స్క్రిప్ట్‌లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇమేజ్‌ని లెక్కలోకి తీసుకోకుండా చేస్తే వాళ్లతో పాటు అభిమానులూ ఒప్పుకోరు. అలా స్టార్ కోసం నేను స్క్రిప్ట్ మార్చలేను. అందుకే ఇప్పటికైతే స్టార్స్‌తో చెయ్యకూడదనే అనుకుంటున్నా. నేను నిజాయితీగా ఉంటా. ఉన్న విషయం మాట్లాడతా అన్నారు.
ఇక ప్రేమకథలు తీయడంలో తేజకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. 'చిత్రం', 'నువ్వు-నేను', 'జయం' లాంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. మళ్లీ తన శైలిలో ఓ ప్రేమకథ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ తేజ ఈ సినిమా చేయబోతున్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. పాత, కొత్త తారాగణమంతా ఇందులో నటిస్తారు.