twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేజ కొత్త చిత్రం కోసం స్టార్ హంట్..డిటేల్స్

    By Srikanya
    |

    Teja
    హైదరాబాద్ : కొత్త వారికి అవకాశాలు ఇవ్వటంలో తేజ ముందు ఉంటారు. ఆయన తొలి చిత్రం 'చిత్రం' నుంచీ ఆయన ఇదే పంథాలో సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు కూడా అదే బాట పట్టారు. తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నటీనటుల అన్వేషణ సాగుతోంది. ఇందుకోసం స్టార్‌హంట్‌ను నిర్వహించబోతున్నారు. సాయిరామ్‌శంకర్ హీరోగా '1000 అబద్ధాలు' నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ, ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

    ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ ''డిసెంబరులో చిత్రీకరణ మొదలుపెడతాం. ఈలోగా నటీనటుల్ని ఎంపిక చేసుకొంటాం. ఆసక్తిగల వారు [email protected] కి ఫొటోల్ని, వీడియోల్ని పంపించవచ్చు'' అన్నారు. ప్రతిభావంతులను అన్వేషించడం, వారితో సినిమాలు చేయడం కోసమే ఈ స్టార్ హంట్ అని చెప్తున్నారు.

    ఈ చిత్రం పూర్తి స్ధాయి డ్రామా గా నడవనుందని తెలుస్తోంది. బడ్జెట్ కంట్రోల్ లోనే ఈ చిత్రాన్ని తేజ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. తేజ ఆ మధ్యన వెంకటేష్ తో రెండేళ్లు కష్టపడి సావిత్రి అనే స్క్రిప్టుని రెడీ చేసుకుని ఓకే చేయించుకున్నారు. వైజాగ్ స్టూడియోలో దాని ఓపినింగ్ కూడా జరిగింది. అయితే అనుకోని విధంగా సురేష్ బాబు ఆ ప్రాజెక్టుని ఆపు చేసేసారు. అయితే ఇప్పుడు ఈ రకంగా కొత్తవారితో ముందుకు వస్తున్నారు.

    ఇక గతంలో తేజ మీడియాతో మాట్లాడుతూ.. స్టార్స్‌ని నేను హేండిల్ చేయలేను. వాళ్ల ఇమేజ్ కోసం స్క్రిప్ట్‌లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇమేజ్‌ని లెక్కలోకి తీసుకోకుండా చేస్తే వాళ్లతో పాటు అభిమానులూ ఒప్పుకోరు. అలా స్టార్ కోసం నేను స్క్రిప్ట్ మార్చలేను. అందుకే ఇప్పటికైతే స్టార్స్‌తో చెయ్యకూడదనే అనుకుంటున్నా. నేను నిజాయితీగా ఉంటా. ఉన్న విషయం మాట్లాడతా అన్నారు.

    ఇక ప్రేమకథలు తీయడంలో తేజకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. 'చిత్రం', 'నువ్వు-నేను', 'జయం' లాంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. మళ్లీ తన శైలిలో ఓ ప్రేమకథ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ తేజ ఈ సినిమా చేయబోతున్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. పాత, కొత్త తారాగణమంతా ఇందులో నటిస్తారు.

    English summary
    
 Director Teja now again Doing Star Hunt For Actors and Actress for his Upcoming movie. This movie is Produced by Prabhakar 1000 Abbalu Movie Producers Currently thismovie is Completed script work and working on Music. Movie Regular Shoot starts from December So Intrested people Mail Your Photos and Videos To This mail id ( 2014PRMMGMAIL.COM )
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X