నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాజల్ వచ్చేస్తుంది.. వెంటపడి మరీ: తేజ
Recommended Video
దాదాపు 15 ఏళ్ల క్రితం చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ తేజ.. చాలా కాలం గ్యాప్ తీసుకొని నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టాడు. దగ్గుబాటి రానా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అందించిన విజయం డైరెక్టర్ తేజలో కొత్త ఉత్సహాన్ని తీసుకొచ్చింది. అయినా మరో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఈయన అదే కాజల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యారు.

డిఫెరెంట్ షేడ్‌లో కాజల్
ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా సీత. ఈ చిత్రంలో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ఈమెదే చిత్రంలో డామినేటెడ్ రోల్. పొగరు బోతు అమ్మాయిగా కాజల్ ఓ డిఫెరెంట్ షేడ్ లో కనిపించనుందట. ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుండటంతో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా విశేషాలను ఓ మీడియా ఛానెల్‌తో పంచుకున్నారు తేజ.

ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాజల్ వచ్చేస్తుంది
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి కామన్. అయితే సక్సెస్‌లో సాగిపోతున్న డైరెక్టర్ల వెంటే స్టార్స్ అంతా ఉంటారు కానీ ఫెయిల్యూర్‌లో ఉన్న వారిని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ కాజల్ అందుకు భిన్నం. నా విషయంలో ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాజల్ నా వెంట నడవటానికి సిద్దమవుతుంది అని తేజ అన్నారు.

ఒక్కసారి చెప్పగానే కాజల్
సీత చిత్ర కథతో కాజల్ వద్దకు వెళ్లగానే ఆ కథకు కాజల్ బాగా కనెక్ట్ అయిందని తేజ అన్నారు. కథ సిద్ధం చేసుకున్నాక ఏదో సరదాగా కాజల్‌తో పంచుకుంటే.. ఆ తర్వాత నుంచి కాజల్ తన వెంటే పడిందని తేజ చెప్పారు.

పట్టుబట్టి మరీ..
ఈ చిత్ర కథ, హీరోయిన్ రోల్ ఎలా ఉంటుందో విన్న కాజల్ ఈ సినిమాను ఎప్పటికైనా తనతో తప్ప ఎవ్వరితో చేయకూడదని పట్టుబట్టిందట. కానీ చిత్రంలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువని చాలా మంది హీరోలు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారని తేజ చెప్పుకొచ్చారు.

సీత
ఫిమేల్ సెంట్రిక్ టైటిల్ టైటిల్ తో వస్తున్న సీత చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ రోల్‌లో పొగరుబోతు అమ్మాయిగా కాజల్ పర్‌ఫార్‌మెన్స్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా, సోను సూద్ కీలక పాత్రలు పోషించారు. మే 24 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది.


Click it and Unblock the Notifications











