తేజా సినిమాకు లిక్కర్ సిండికేట్ బెదిరింపులు?
ఈ మధ్య మన తెలుగు సినిమాలు చాలా వరకు వివాదాలతో ముడి పడి ఉంటున్నాయి. ఏ సినిమా తీసుకున్నా ఏదో వివాదం తలెత్తడం, ఆ వివాదాలతోనే సినిమా బాగా పబ్లిసిటీ అవ్వడం జరుగుతోంది. తాజాగా దర్శకుడు తేజ రూపొందిస్తున్న 'నీకు నాకు డాష్ డాష్' సినిమా కూడా వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దర్శకుడు తేజ లిక్కర్ సిండికేట్లను, మోస పూరిత వ్యాపారాలను ఫోకస్ చేశాడట. దీంతో ఈ చిత్రం విడుదలకు ముందే సినిమా నుంచి సదరు సీన్లను కత్తిరించాలని ఆ సినిమా యూనిట్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఓ వైపు రాష్ట్రంలో లిక్కర్ సిండికేట్లపై అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తేజ సినిమాకు లిక్కర్ సిండికేట్ల నుంచి బెదిరింపు కాల్స్ రావడం చర్చనీయాంశం అయింది.
అయితే తేజా మాత్రం తమకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని, వివాదాలతో తన సినిమాకు ప్రచారం కల్పించుకోవాలనే ఉద్దేశ్యం లేదని, తాను కథ, కథానాన్ని నమ్ముకుని సినిమా రూపొందించానని స్పష్టం చేశారు. 10 నెలల క్రితమే తాను 'నాకు నీకు డాష్ డాష్' సినిమాకు సంబంధించి స్క్రిప్టు రాసుకున్నానని, లిక్కర్ సిండికేట్లను ఎక్స్ ఫోజ్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను, కానీ తమ సినిమా ముందగానే లిక్కర్ సిండికేట్లపై ఏసీబీ దాడులు జరుగుతుండటం కాకతాళీయమే అన్నారు.


Click it and Unblock the Notifications











