twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కేక' కోసం జైలు కెళతా: తేజ

    By Staff
    |

    teja
    పైరసీ నివారణపై శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తేజ మాట్లాడుతూ... తన సినిమాను పైరసీ చేస్తే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికైనా వెనుకంజ వేయనని పునరుద్ఘాటించారు.కన్నబిడ్డకంటే ఎక్కువగా తాను సినిమాను చూసుకుంటానని, అటువంటి దాన్ని దొంగలిస్తే నేరస్తుడిగా మారి జైలుకెళ్ళడానికైనా సిద్ధమని దర్శకుడు తేజ స్పష్టం చేస్తున్నారు.

    ఎంతో కష్టపడి తమ బుర్రల్లోంచి పుట్టిన ఆలోచనలను సోమరుపోతుల్లా దొంగలించేవారిని చూస్తూ ఊరుకోబోమని పైరసీ దారులను హెచ్చరించారు. "జయం" సినిమా టైమ్‌లో తాము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తమ సినిమాను పైరసీ చేసిన వారిని కొందరిని పట్టుకున్నామని ఈ సందర్భంగా తేజ గుర్తు చేశారు. ఆ సమయంలో ఫిలిమ్ ఛాంబర్‌లో పైరసీ సెల్ ఉందనే విషయం తనకు తెలియదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

    మరో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ... ఒక సినిమాను నిర్మించడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందన్నారు. అంత కష్టపడి సినిమా తీస్తే విడుదలైన వెంటనే పైరసీ చేసేస్తున్నారని తెలిపారు. దీనివల్ల మంచి సినిమా నాశమనమతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే విడుదలైన సినిమా పైరసీ సీడీలు వారంలోనే మార్కెట్లోకి వచ్చేస్తున్నాయని, వాటిని అడ్డుకునే చట్టమేమీ లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

    శౌర్యం నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. నిర్మాతల నుంచి లక్షలు వసూలు చేస్తున్న యాంటీ వీడియో పైరసీ సెల్ ద్వారా ఎవరికైనా న్యాయం జరిగిందేమోకానీ తనకు మాత్రం అన్యాయం జరిగిందని చెప్పారు. తమ సినిమా డివీడీలు ఎక్కడబడితే అక్కడ విచ్చల విడిగా అమ్ముతున్నారని ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు.

    రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ... ఒక సినిమాపై ఎందరో జీవితాలు ఆధారపడి ఉన్నాయని, తమ కష్టాన్ని దొంగలు దోచుకుంటే రోడ్డునపడే పరిస్థితి వస్తుందన్నారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో చింతకాయల రవి నిర్మాత నల్లమలుపు బుజ్జికూడా మాట్లాడారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X