కామెడీగా తేజ '1000 అబద్ధాలు'

By Pratap

హైదరాబాద్: తేజ - సాయిరామ్ శంకర్ తొలి కాంబినేషన్‌లో శ్రీ ప్రొడక్షన్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 1000 అబద్ధాలు అని పేరు పెట్టారు. పి. సునీత, ఎన్. సీతారామయ్య ఈ చిత్రానికి నిర్మాతలు. రమణ గోగుల స్వరాలందిస్తున్నారు.

గురువారం హైదరాబాదులో ఈ చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - "ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఆద్యంతం నవ్వులు పండించే విధంగా ఉంటుంది. ప్రేమ కూడా కొత్త తరహాలో ఉంటుంది" అన్నారు.

నిర్మాతలు ఇంకా ఇలా అన్నారు - "కథాకథనం తేజ శైలిలో ఆకట్టుకుంటాయి. తేజ చిత్రానికి రమణ గోగుల స్వరాలందించడం ఇదే ప్రథమం. ఇందులో మొత్తం ఆరు పాటలుంటాయి. సాయిరామ్ శంకర్ సరసన ఓ కొత్త కథానాయకను ఎంపిక చేస్తున్నాం. ఈ నెల 17వ తేదీన చిత్రీకరణ ప్రారంభిస్తాం". ఈ చిత్రానికి కెమెరా రసూల్ కాగా, చిత్రాని హారిక సమర్పిస్తున్నారు.

తెలుగు సినీ రంగంలో కొత్తదనానికి పెద్ద పీట వేసే తేజ దర్శకుడిగా తనదంటూ ఓ ప్రత్యేక శైలిని అలవరుచుకున్నారు. తనదైన శైలిలో సినిమాలను అందిస్తూనే సినీ పరిశ్రమకు కొత్త నటీనటులను పరిచయం చేయడం ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X