తేజ నెక్ట్స్ చిత్రం ఆ యంగ్ హీరోతో ఖరారు
నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ..''తేజ-సాయిరామ్‌శంకర్ కాంబినేషన్‌లో ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా చేయబోతున్నాం. అక్టోబరులో చిత్రీకరణ మొదలుపెడతాం. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అలాగే ప్రశాంత్‌వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ సాయిరామ్ శంకర్‌తోనే మరో సినిమా చేస్తున్నాం. ఇటీవలే పూజాకార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నెలాఖరున షూటింగ్ మొదలుపెడతాం. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా, క్రైమ్ కామెడీతో ఈ సినిమా ఉంటుంది'' అన్నారు. ఈ చిత్రాలకు సమర్పణ: హారిక.
ఇక నీకు నాకు డాష్ డాష్ సినిమా తర్వాత తేజ చేస్తున్న చిత్రం ఇది. ఆ మధ్యన దగ్గుపాటి రానా తో తేజా చిత్రం చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. రీలాంచ్ సినిమాగా వచ్చిన నీకు నీకు డాష్ డాష్ డిజాస్టర్ అయ్యింది. దాంతో తేజతో చేయటానికి పెద్ద హీరోలెవరూ ఆసక్తి చూపటం లేదు. అయితే సాయిరామ్ శంకర్ కూడా అదే సిట్యువేషన్ లో ఉన్నాడు. అతనితో చేయటానికి కూడా పెద్ద నిర్మాతలు సాహసం చేయటం లేదు.
ప్రస్తుతం సాయిరామ్ శంకర్ 'యమహో యమః' అనే చిత్రం చేస్తున్నారు. ఒక యమభక్తుడు సృష్టించే సందడితో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. యమధర్మరాజు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాన్ని తెరపైనే చూడాలి. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో కథ సాగుతుంది. యమధర్మరాజుగా శ్రీహరి నటన ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రంలో సాయిరామ్‌శంకర్, పార్వతి మెల్టన్ జంటగా నటిస్తున్నారు. శ్రీహరి యమధర్మరాజు పాత్రని పోషిస్తున్నారు. జి.విజయ్‌కుమార్‌గౌడ్ నిర్మాత. రచన: వెలిగొండ శ్రీనివాస్, సంగీతం: మహతి, కళ: వి.ఎస్.మణి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్.


Click it and Unblock the Notifications












