తేజ సినిమాలో అరుణ్ ఔట్
సినిమాని ప్రారంభించాక నటుల్ని మార్చడం దర్శకుడు తేజకు ఆనవాయితీగా మారుతోంది. గతంలో నిజం.. ఐటిస్ ఎ లై చిత్రంలో మురళీమోహన్‌తో కొద్దిరోజులు షూట్ చేసి తర్వాత ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ని పిలిపించి పెద్ద దుమారం రేపిన తేజ మళ్లీ అదే పద్ధతిని తన తదుపరి చిత్రంలో కూడా పాటించారు.
కల్యాణ్‌రామ్ హీరోగా తేజ తాజాగా తీస్తున్న లక్ష్మీ కల్యాణం చిత్రంలో ఒక పాత్రకు దర్శక రత్న దాసరి పుత్రరత్నం దాసరి అరుణ్‌కుమార్‌ని ఎంచుకున్నారు. రెండు మూడు రోజులు షూటింగ్ చేశాక ఏమైందో ఏమో అరుణ్‌కుమార్‌కి ఉద్వాసన చెప్పి ఆ స్థానంలో అజయ్‌ని తీసుకున్నారు. చిన్నచిన్న వేషాలు వేస్తూ విలన్‌గా, హీరో ఫ్రెండుగా రాణిస్తూ వచ్చిన అజయ్‌కు విక్రమార్కుడు చిత్రంలో ప్రధాన విలన్ వేషం ఇచ్చి ప్రమోట్ చేశారు ఎస్.ఎస్.రాజమౌళి.
అయితే అరుణ్ కుమార్‌ని ఎందుకు తప్పించి, అజయ్‌కి అవకాశం కల్పించారో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. డైరెక్టర్ తేజ తీరే అంత అని సరిపెట్టుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











