నా సినిమాలో ఎప్పుడైనా... ఎవరైనా మారవచ్చు

కొద్ది కాలంగా ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు రాజా హీరోగా పరియం అవుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే హీరో హీరోయిన్ల పేరును వెల్లడించడానికి తేజ ఇష్టపడలేదు. 'నా సినిమాలో ఎప్పుడు ఎవరైనా మారవచ్చు. హీరోగా రాజా వుండనూ వచ్చు, లేకపోనూ వచ్చు' అని చెప్పడం సందేహాలకు తావిస్తోంది. అయినా ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ ఎంతకాలం సినిమాలను కాపాడుతుందని సీనియర్లు పెదవి విరుస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. తాజాగా హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. మిగతా 20 శాతం సినిమా షూటింగును కోల్‌కత్తాలో జరపాలని తేజ నిర్ణయించుకున్నాడు. త్వరలోనే అక్కడ చిత్రీకరణ మొదలు కానున్నది. ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలని ఆయన సంకల్పించాడు.


Click it and Unblock the Notifications











