తేజ కొత్త చిత్రం హీరో ఫైనల్..ఎవరంటే

By Srikanya

Baladitya
హైదరాబాద్ :దర్శకుడు తేజ కొత్తగా తెరకెక్కించనున్న చిత్రానికి హీరోగా ఆదిత్య (బాలాదిత్య) ఎంపికయ్యారు. ప్రభాకర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నెలాఖరుకల్లా ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో పాటలను కూడా ఆదిత్యే రాస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

ఈ చిత్రం పూర్తి స్ధాయి డ్రామా గా నడవనుందని తెలుస్తోంది. బడ్జెట్ కంట్రోల్ లోనే ఈ చిత్రాన్ని తేజ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. తేజ ఆ మధ్యన వెంకటేష్ తో రెండేళ్లు కష్టపడి సావిత్రి అనే స్క్రిప్టుని రెడీ చేసుకుని ఓకే చేయించుకున్నారు. వైజాగ్ స్టూడియోలో దాని ఓపినింగ్ కూడా జరిగింది. అయితే అనుకోని విధంగా సురేష్ బాబు ఆ ప్రాజెక్టుని ఆపు చేసేసారు. అయితే ఇప్పుడు ఈ రకంగా కొత్తవారితో ముందుకు వస్తున్నారు.

ఇక గతంలో తేజ మీడియాతో మాట్లాడుతూ.. స్టార్స్‌ని నేను హేండిల్ చేయలేను. వాళ్ల ఇమేజ్ కోసం స్క్రిప్ట్‌లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇమేజ్‌ని లెక్కలోకి తీసుకోకుండా చేస్తే వాళ్లతో పాటు అభిమానులూ ఒప్పుకోరు. అలా స్టార్ కోసం నేను స్క్రిప్ట్ మార్చలేను. అందుకే ఇప్పటికైతే స్టార్స్‌తో చెయ్యకూడదనే అనుకుంటున్నా. నేను నిజాయితీగా ఉంటా. ఉన్న విషయం మాట్లాడతా అన్నారు.

ఇక ప్రేమకథలు తీయడంలో తేజకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. 'చిత్రం', 'నువ్వు-నేను', 'జయం' లాంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. మళ్లీ తన శైలిలో ఓ ప్రేమకథ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ తేజ ఈ సినిమా చేయబోతున్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. పాత, కొత్త తారాగణమంతా ఇందులో నటిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X