నువ్వే నా హీరో!!!
ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా దర్శకుడు తేజ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు నువ్వే నా హీరో. పేరు చూడ్డానికి విచిత్రంగా అనిపించినా ఈ పేరే తన దగ్గరున్న స్క్రిప్ట్ కు సరైన పేరని తేజ అంటున్నారు. ఈనెల 14నుంచి ఈ సినిమా ప్రారంభం కానున్నది. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకు ఆధారం ప్రేమ కథ. కొత్తమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం. కొత్త నటీనటుల కోసం టాలెంట్ సెర్చ్ ను ప్రారంభించిన తేజ మార్చిలో మరో సినిమాను ప్రారంభించినున్నాడు.


Click it and Unblock the Notifications











