కష్టాల్లో తేజ ' కేక '
వరస ఫెయల్యూర్స్ లో ఉన్న తేజ 'కేక 'తో కలిసి వస్తుందనుకున్నాడు. కాని ఇప్పుడు ఆ ఆశలు కూడ అడుగంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఆ ప్రాజెక్టుకు క్రేజీ తెచ్చిన పెద్దలు ఒక్కొక్కరే తప్పుకుంటున్నారు. నిర్మాతలుగా వ్యవహరిస్తామన్న సురేష్ ప్రొడక్షన్స్ తేజ పెట్టే షరతులుకు విసిగి తప్పుకోనుందిట. అలాగే సంగీతాన్ని అందిస్తానన్న ఇళయరాజా, కెమేరామెన్ పి.సి.శ్రీరామ్ కూడా సురేష్ బాబునే ఫాలో అవుతూ తప్పుకుంటున్నారట. ఇది తెలిసిన ఇండస్ట్రీ పెద్దలు తేజాతో ఎంతటి వాళ్ళైనా వేగటం కష్టం. కొత్త నటులలాగానే మిగతా సాంకేతిక వర్గం కూడా కొత్త వాళ్ళయితేనే సుఖం. ఎలా చెప్పినా వింటారు, భరిస్తారు, ఎదురు చెప్పరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదైమైనా తేజా కాస్త హిట్ వచ్చే దాకా కాస్త ఒద్దికగా ఉంటే మేలని శ్రేయాభిలాషులు పైకి చెప్పలేక గొణుక్కుంటున్నారు.


Click it and Unblock the Notifications











