'రాము' బాటలో తేజ
'శివ' చిత్రం నుండీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పనిచేసిన అనుభవమో ఏమో దర్శకుడు తేజ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడు. ఒకే స్టోరీ లైన్ తో రెండు మూడు సినిమాలు తీయడంలోనే కాకుండా వరుస పరాజయాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో రామును అనుసరించిన తేజ, ఇప్పుడు కొత్తగా రాము 'RGV కార్పొరేషన్స్ ప్రై. లి.' లానే తను కూడా 'జయం మూవీస్ ప్రై. లి.' బ్యానర్ పై కార్పొరేట్ స్టైల్ లో వరుగా సినిమాలు నిర్మిచబోతున్నారు.
ఇంతకు ముందే 'చిత్రం మూవీస్' బ్యానర్ పై సినిమాలు నిర్మంచిన తేజ జయం మూవీస్ తో పూర్తిస్థాయి నిర్మాతగా మారుతున్నారు. ఈ బ్యానర్ పై 50 సినిమాలు నిర్మిచబోతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా 10 సినిమాలు మొదలుపెట్టబోతున్నారు. తొలిగా 'అలివేలు మంగ' చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో తీయబోతున్న ఈ చిత్రానికి 'కోడి రామకృష్ణ' దర్శకత్వం వహించబోతున్నారు. ప్రతిఘటన, అంకుశం చిత్రాల తరహాలో ఈ చిత్రం ఉండబోతున్నట్టు సమాచారం. కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరున మొదలుకాబోతోంది.
తర్వాతి చిత్రాలు రసూల్, 'ఓయ్' ఫేం ఆనంద్ రంగా ల దర్శకత్వం లో రాబోతున్నట్టు....ముగ్గురు కొత్త దర్శకులను పరిచయం చెయ్యబోతున్నట్టు తేజ తెలియజేసారు.


Click it and Unblock the Notifications











