అమ్మయ్య!తేజ భాధ మనకిక లేనట్లే?

తాను కొత్త స్క్రీన్ ప్లేకి ప్రయత్నం చేసానని అది వర్కవుట్ కాలేదని సమర్ధించుకున్నాడు. ఇక ఈ విషయం విన్న చాలా మంది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. తేజ తన స్వీయ లాభం కోసం టీనేజ్ పిల్లల మధ్య ప్రేమ కథలు తీస్తూండటం చాలామందికి మింగుడు పడని విషయమే. అయితే అవి హిట్టవటంతో ఇప్పుడు అదే రూటులో మరికొంత మంది దర్శకులు ప్రయాణించి టెన్త్ క్లాస్ ప్రేమ కథలను తెరకెక్కించటం మరింత కలవరపరిచే విషయం. దాంతో కాస్త తేజ లాంటి వాళ్ళు రెస్ట్ తీసుకుంటే అటువంటి చిత్రాల రాక ఆగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
అయితే విశ్లేషకులు మాత్రం తేజా అంటించిన నిప్పు అప్పుడే ఆరదనీ చాలా మంది దర్శకులు,నిర్మాతలు అదే తరహా కథలతో రంగంలోకి దూకటానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇది కొనసాగి సెవెంత్ క్లాస్ ప్రేమ కథలు వచ్చినా ఆశ్చరం లేదంటున్నారు.


Click it and Unblock the Notifications











