'కేక' మళ్ళీ వాయిదా ఎందుకో?

ఇక ఈ హీరోయిన్ కీ అసలు పేరే వాళ్ళ అమ్మ నాన్న పెట్టలేదని ...తనే ఇషానీ అనే పేరు పెట్టానని చెప్పటం, హీరో గా కొత్త వాళ్ళని స్టార్ హంట్ ద్వారా ఎంపిక చేసానని అంటూనే సీతారామశాస్త్రి గారబ్బాయిని హీరోగా ఎన్నుకున్నాడు. ఆడియా ని మొదట సినిమా రిలీజయి పాపులర్ అయ్యాక రిలీజ్ చేస్తానంటూనే ఈ మధ్య రిలీజ్ చేసాడు. ఇలా ప్రతీ విషయంలోనూ పొంతనలేని మాటలు,పబ్లిసిటీ జిమ్మిక్కులు చేయటం ద్వారా ఆయనకు బయిట,పరిశ్రమలోనూ నమ్మకం పోగెట్టుకున్నాడు.
అందులోనూ ప్రతీసారీ మినిమం గ్యారెంటీ కోసం చిన్న వయస్సు పిల్లల మధ్య లవ్ స్టోరీ తియ్యటం కొంతమందికి మింగుడు పడని విషయం. అయితే తేజ ఈ సారి గ్యారింటీగా కేక సరిగా వెయ్యాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరస పరాజయాలనుండి అతను బయిటపడకపోతే మరోసారి ఆఫర్ రావటం కష్టమే. స్వంత డబ్బు పెట్టి మళ్ళీ నమ్మకాన్ని ప్రోగుచేసుకోవాల్సి ఉంటుంది. అయినా మల్టి టాలెంటెడ్ అని పేరు తెచ్చుకున్న తేజ చక్కగా తన పనేదో తాను చేసుకుని హిట్టుకొట్టి గౌవరం నిలుపుకోవచ్చుకదా...


Click it and Unblock the Notifications











