'కేక' పెడతాడా..పెట్టిస్తాడా?

ఈ సినిమాతో ఆయన ముఫ్ఫై ఆరు మంది నటీనటీలను తెరకు పరిచయం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం అడాల్ సెన్స్ నుండి టీనేజ్ లోకి ప్రవేశించేటప్పుడు యువతీ యువకుల్లో కలిగే సమస్యలు,సందేహాలు,స్పందనలు సమాహారం అంటున్నాడు. ఈ సినిమా ముఖ్యంగా ఐదు పాత్రలు చుట్టూ తిర్గుతుంది. ఇక ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అలాగే రాజమండ్రి,బెంగుళూరు,హైదరాబాద్ లలో కథా ప్రయాణం జరుగుతుంది. క్లైమాక్స్ మాత్రం కలకత్తాలోనే జరుగుతుంది.వరస ఫ్లాఫ్ లలో ఉన్న తేజ ఇక ఈ సినిమా హిట్టయితే నిలబడతాడు. లేకుంటే మళ్ళీ సినిమా రావటానికి చాలా టైమ్ పడుతుంది. దాదాపు ఐదున్నర కోట్ల తో తీసానంటున్న ఈ సినిమాను ఎవరూ కొనటానికి రాకపోవటం సొంతంగా రిలీజ్ చేసుకోవటం చాలా మంది దర్శకులు గమనించాల్సిన విషయం.


Click it and Unblock the Notifications











