Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తేజ ‘నీకు నాకు డాష్ డాష్’స్టోరీ లైన్..రిలీజ్ డేట్
ఈ చిత్రం కథ గురించి తేజ మాట్లాడుతూ...''ఈ కథ లిక్కర్ మాఫియా నేపథ్యంలో సాగుతుంది. లిక్కర్ సిండికేట్‌లో ఎవరికీ తెలీని కొత్తకోణాన్ని ఇందులో చూస్తారు. అలాగని సినిమా మొత్తం లిక్కర్ గోలే ఉండదు. ఇది ఓ అందమైన ప్రేమకథ. కొంత కల్పన, కొంత రియాలిటీ ఉంటుంది. లిక్కర్ తయారు చేసే కంపెనీలో హీరోహీరోయిన్లు పనిచేస్తుంటారు. వారి వల్ల అక్కడ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటినుంచి ఆ ప్రేమజంట ఎలా బయటపడ్డారనేదే సినిమా'' అన్నారు.
అలాగే ఈ చిత్రాన్ని నిర్మాతలు స్వంతంగా విడుదల చేసుకుంటున్నారు. ఎవరూ కొనటానికి ముందుకు రాకపోవటం వల్లే ఇలా స్వయంగా విడుదలు చేసుకుంటున్నారనే టాక్ బయిట ఉంది. దానిని ఖండిస్తూ తేజ..నిర్మాత వి.ఆనంద్‌ప్రసాద్‌కి సినిమా బాగా నచ్చింది. అందుకే ఆయన అమ్మట్లేదు. సొంతంగానే విడుదల చేసుకుంటున్నారు అన్నారు.
హీరో,హీరోయిన్స్ నిజ జీవిత కుటుంబ నేపధ్యం గురించి చెబుతూ.. మా చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న నందిత హైదరాబాద్ అమ్మాయి. వాళ్ల నాన్న ఆర్మీలో కల్నల్. ఈ సినిమా కోసం మేం జరిపిన కాంటెస్ట్‌లో పాల్గొని విజయం సాధించింది. హీరో ప్రిన్స్ కూడా అలా ఎంపికైనవాడే. వాళ్ల నాన్నది వైజాగ్‌లో డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని చెప్పారు తేజ.
చివరగా నిర్మాత మాట్లాడుతూ ...'డాష్ డాష్' అంటే అదేదో తప్పు అర్థం వచ్చే పదం అనుకోవద్దు. ఇటీవలే మా అమ్మాయితో కలిసి సంతోషంగా ఈ సిసిమా చూశాను. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఈనెల 12న మూడు వందల థియేటర్లలో విడుదల చేస్తున్నాం అని తెలిపారు.