twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేజ ‘నీకు నాకు డాష్ డాష్’స్టోరీ లైన్..రిలీజ్ డేట్

    By Srikanya
    |

    తేజా చాలా గ్యాప్ తర్వాత అందరూ కొత్త నటీనటులతో చేస్తున్న చిత్రం 'నీకు నాకు డాష్ డాష్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. లిక్కర్ మాఫియా నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో,హీరోయిన్స్ తో పాటు 42 కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు. మ్యూజిక్ డెరైక్టర్ యశ్వంత్‌నాగ్‌కి ఇదే తొలిసినిమా.

    ఈ చిత్రం కథ గురించి తేజ మాట్లాడుతూ...''ఈ కథ లిక్కర్ మాఫియా నేపథ్యంలో సాగుతుంది. లిక్కర్ సిండికేట్‌లో ఎవరికీ తెలీని కొత్తకోణాన్ని ఇందులో చూస్తారు. అలాగని సినిమా మొత్తం లిక్కర్ గోలే ఉండదు. ఇది ఓ అందమైన ప్రేమకథ. కొంత కల్పన, కొంత రియాలిటీ ఉంటుంది. లిక్కర్ తయారు చేసే కంపెనీలో హీరోహీరోయిన్లు పనిచేస్తుంటారు. వారి వల్ల అక్కడ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటినుంచి ఆ ప్రేమజంట ఎలా బయటపడ్డారనేదే సినిమా'' అన్నారు.

    అలాగే ఈ చిత్రాన్ని నిర్మాతలు స్వంతంగా విడుదల చేసుకుంటున్నారు. ఎవరూ కొనటానికి ముందుకు రాకపోవటం వల్లే ఇలా స్వయంగా విడుదలు చేసుకుంటున్నారనే టాక్ బయిట ఉంది. దానిని ఖండిస్తూ తేజ..నిర్మాత వి.ఆనంద్‌ప్రసాద్‌కి సినిమా బాగా నచ్చింది. అందుకే ఆయన అమ్మట్లేదు. సొంతంగానే విడుదల చేసుకుంటున్నారు అన్నారు.

    హీరో,హీరోయిన్స్ నిజ జీవిత కుటుంబ నేపధ్యం గురించి చెబుతూ.. మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నందిత హైదరాబాద్ అమ్మాయి. వాళ్ల నాన్న ఆర్మీలో కల్నల్. ఈ సినిమా కోసం మేం జరిపిన కాంటెస్ట్‌లో పాల్గొని విజయం సాధించింది. హీరో ప్రిన్స్ కూడా అలా ఎంపికైనవాడే. వాళ్ల నాన్నది వైజాగ్‌లో డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ అని చెప్పారు తేజ.

    చివరగా నిర్మాత మాట్లాడుతూ ...'డాష్ డాష్' అంటే అదేదో తప్పు అర్థం వచ్చే పదం అనుకోవద్దు. ఇటీవలే మా అమ్మాయితో కలిసి సంతోషంగా ఈ సిసిమా చూశాను. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఈనెల 12న మూడు వందల థియేటర్లలో విడుదల చేస్తున్నాం అని తెలిపారు.

    English summary
    Teja's latest film 'Neku Naku Dash Dash' is releasing on 12 of this Month. Teja is introducing Hyderabad girl Nanditha as heroine in his film. The film is based on liquor mafia.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X