»   »  కెవ్వు...కేక!?!?!

కెవ్వు...కేక!?!?!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Teja
ఈ మధ్య కెవ్వు...కేక అనే పదం బాగా వినపడుతోంది. ముఖ్యంగా ఎఫ్.ఎం రేడియోలలో జాకీలు కేక మీద కేకలు పెడుతున్నారు. కేక కథ ఏమిటో తెలియదు కానీ కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు ఈ కేక ఇపుడు బాగా పాపులర్ అయిపోయింది. ఈ కేక పేరుతోనే దర్శకుడు తేజ సినిమా తీయనున్నాడు. ఈ సినిమా కోసమే టాలెంట్ సెర్చ్ జరుగుతోంది. ఈ సెర్చ్ లో విజేతలు హీరోహీరోయిన్లుగా కేకలో చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కో-ప్రొడక్షన్ లో ఈ సినిమా నిర్మితం కానున్నది. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభం కానున్నది. జనవరిలో ఆడియో రికార్డింగ్ జరగనున్నది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X