ఎం.ఎస్.రాజు కొడుకు హీరోగా తేజ సినిమా
టీనేజీ లవ్ సినిమాలకు పెట్టింది పేరు తేజ. అలాంటి తేజ ఇపుడు మెగా ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఒకవైపు మరో కొత్త సినిమా కోసం కొత్త టాలెంట్ కోసం టాలెంట్ సెర్చ్ ను ప్రారంభిస్తున్న తేజ మరో వైపు రాజుతో సినిమాకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమాలో హీరో రాజు కుమారుడు సుమంత్ అశ్విన్. ఈ సినిమా కథ టీనేజీ కుర్రాడీ లవ్ స్టోరీ. ఇందులో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ డిసెంబర్ 14న ప్రారంభం కానున్నదని ఫిల్మ్ నగర్ సమాచారం.


Click it and Unblock the Notifications