తేజ సినిమాకు అడల్డ్ రేటింగ్
సినిమాలో వాడిన భాష, కొన్ని సన్నివేశాలు, హింస నేపథ్యంలో సెన్సార్ బోర్డు వారు ఈ సర్టిఫికెట్ జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రిన్స్, నందిత జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి వి.ఆనందప్రసాద్ నిర్మాత.
దర్శకుడు తేజ ఈ చిత్రం గురించి ఇటీవల ప్రెస్ మీట్ లో వివరిస్తూ...మద్యం సిండికేట్ల నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇదని, ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సిండికేట్లపై చర్చ జరగడం ఈ చిత్రంలో అదే అంశం ఉండడం యాదృచ్ఛికమని, 42 మంది కొత్తవారిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తేజ మార్కు ప్రేమ కథలో కొత్త కోణంగా నిలిచే చిత్రంలో ఆందరికీ నచ్చే అంశాలున్నాయనీ నిర్మాత అన్నారు. తీర్థ, ధర్మవరపు, తనికెళ్ల భరణి, బెనర్జీ తదితరులు నటించారు. మాటలు: రామస్వామి, సంగీతం: యశ్వంత్ నాగ్, నిర్మాత: వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం: తేజ.


Click it and Unblock the Notifications












