తేజ కొత్త చిత్రం 'అటు-ఇటు' లో నటించాలని ఉన్నవారికై...
తేజా..తాజాగా అటు-ఇటు అనే చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా దాదాపు నలభై మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలని నిర్ణయించుకుని ప్రెస్ నోట్ ద్వారా ఆ విషయాన్ని తెలియ చేయటం జరిగింది. ఈ చిత్రాన్ని జయం మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తారు. ఓ దురదృష్టవంతుడైన కుర్రాడు ప్రేమ కోసం తపిస్తూ ఓ టీనేజ్ అమ్మాయి ప్రేమలో పడటం కధాంశం.
ఈ చిత్రంలో నటించాలంటే...హీరో పాత్ర కోసం 18-20 సంవత్సరాల యువకుడు కావాలి.అతను ఎత్తు 5.7"- 5.9" మధ్య ఉండాలి.
ఆసక్తి కలవారు తమ మీడియం సైజు ఫొటోలను(ఒకటి ఫుల్ గానూ, రెండోది క్లోజ్ అప్) తీసి పంపించాలి.
ఈ మెయిల్ ఎడ్రస్...[email protected]
లేదా..
జయిం మూవీస్,
224 A, రోడ్ నెంబర్ 17,ఆంధ్రా బ్యాంక్ నెక్ట్ రోడ్,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్.
పోస్టర్ ఎడ్రస్ కు పోస్ట్ చేయండి.
డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. సెలక్షన్స్ మొదలయ్యాయి. రెండు నెలల్లో చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. పాండిచ్చేరి చుట్టప్రక్కల షూటింగ్ జరుగుతుంది. ఆసక్తి ఉన్న వారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.


Click it and Unblock the Notifications











