Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
తేజ ట్యాలెంట్ హంట్ ఏమయ్యింది?
దర్శకుడు తేజ ఆ మధ్యన తన దర్శకత్వంలో రూపొందబోయే 'నీకు నాకు డాష్ డాష్' చిత్రం నిమిత్తం ట్యాలెంట్ హంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్టాడుతూ... 'ఎలాంటి రికమండేషన్లకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ ఎంపిక జరిగింది. హీరోహీరోయిన్ పాత్రలతో పాటు మిగిలిన పాత్రలకు 42 మంది కొత్తవాళ్లను ఎంపిక చేశాం. అలాగే కొత్త సంగీత దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నాం. దసరా రోజున ప్రారంభించి హైదరాబాద్, వైజాగ్, అరకులో ఏకధాటిగా షూటింగ్ జరిపి చిత్రాన్ని పూర్తి చేస్తాం' అన్నారు. నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ...'తెలుగులో ఉన్న ప్రతిభావంతులైన నటీనటుల్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో భవ్య సిమెంట్ యాక్టింగ్ హంట్ నిర్వహించాం. దాదాపు పాతిక వేల అప్లికేషన్లు వచ్చాయి.
వాటిలో ఫిల్టర్ చేసి తెలుగు వాళ్లనే హీరో హీరోయిన్లుగా ఎంపిక చేశాం. సినిమా పరిశ్రమతో వీళ్లకు సంబంధం లేదు. ఈ ఎంపిక విషయంలో దర్శకులు శివ నాగేశ్వరరావు, చంద్రసిద్దార్థ్ మాకు ఎంతో సహకరించారు' అన్నారు. అంతా కొత్త తారలతో దర్శకుడు తేజ మరో ప్రేమకథాచిత్రానికి శ్రీకారం చుట్టారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మించే ఈ చిత్రానికి 'నీకు నాకు డాష్ డాష్' అనే పేరు నిర్ణయించారు. అక్టోబర్ 6న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాస్తారు. ఈ చిత్రానికి సమర్పణ: వి.కృష్ణకుమారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి.