సురేష్ బాబు హ్యాండ్ ఇచ్చాడని...తేజ అలా
'చిత్రం', 'జయం', 'నువ్వు నేను 'వంటి యూత్ లవ్ స్టోరీస్ తనకంటూ ముద్రవేసుకున్న దర్శకుడు తేజ. అయితే ఆ చిత్రాలతో ఆయన కొత్త వారిని పరిచయం చేసి మరో సంచలనం క్రియేట్ చేసారు. ఇప్పుడు మరోసారి ఆ తరహా ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. హీరో, హీరోయిన్స్, ఇతర పాత్రల ఎంపిక కోసం తేజ సెర్చింగ్ మొదలెట్టాడు. ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తారు. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఇక వెంకటేష్ తో సురేష్ ప్రొడక్షన్ లో చేద్దామనుకున్న సావిత్రి ప్రాజెక్టు అటక ఎక్కటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











