తేజ ‘1000 అబద్ధాలు’విడుదల తేదీ ఖరారు

By Srikanya

హైదరాబాద్ : దర్శకుడు తేజ తాజా చిత్రం'1000 అబద్ధాలు'. ఎస్తేర్‌ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సాయిరామ్ శంకర్ హీరోగా చేస్తున్నారు. పాలడుగు సునీత నిర్మాత. రమణ గోగుల స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం జూలై 5 న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇదే వారంలో పాటల్ని విడుదల చేయబోతున్నారు.

తేజ మాట్లాడుతూ- ''పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి '1000 అబద్ధాలు' అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం'' అని చెప్పారు.

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ... మంచి పని కోసం ఎన్ని అబద్ధాలాడినా తప్పు లేదంటారు. ఓ జంట మాత్రం ఏకంగా వెయ్యి అబద్ధాలు ఆడేసింది. ఇంతకీ వాళ్లు తలపెట్టిన పనేమిటి? అసలు ఎవరా జంట? అబద్ధాలు చెప్పాక... వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? తదితర విషయాల్ని మా చిత్రంలో చూడొచ్చంటున్నారు

ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: రమణగోగుల, కెమెరా: రసూల్ ఎల్లోర్, కళ: నరసింహవర్మ, ఎడిటింగ్: శంకర్, పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్. సమర్పణ: చిత్రం మూవీస్, నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X