twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్టర్ తేజ వివాదం..పోలీసులు ఎంట్రీ..బ్యాన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : దర్శకుడు తేజ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన తన తాజా చిత్రం ‘హోరా హోరీ' షూటింగ్ కు అంతరాయం కలగటం..పోలీసులు ఎంట్రీతో అంతటా చర్చనీయాంసంగా మారింది. అంతేకాదు ఈ ఇష్యూ చివరకు ఏపి ఫిల్మ్ ఎంప్లాయీస్ యూనియన్ ..తేజ పై బ్యాన్ పెట్టే స్ధితికి తీసుకు వెళ్లింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    పూర్తి వివరాల్లోకి వెళితే...
    రీసెంట్ గా తేజ ‘హోరా హోరీ' అనే సినిమాని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ ని తెలంగాణ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుంచి ఎంచుకున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్ కి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందుల వల్లే నిన్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది.

    Teja’s film’s shooting disrupted

    ఈ సినిమా కోసం ఒక్క ఏపి ఫిల్మ్ ఎంప్లాయిని కూడా తీసుకోలేదని ఏపి ఫిల్మ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి 20 మంది వచ్చి సినిమా షూటింగ్ ని నిలిపివేశారు. దాంతో తేజ లోకల్ పోలీసులకి న్యూసెన్స్ అని కేసు పెడితే వారు వచ్చి ఆ 20 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. వారందరూ మళ్ళీ గొడవ చెయ్యము అని మాట ఇచ్చాక పోలీసులు వారిని వదిలేసారు. ప్రస్తుతం అంతా సెటిల్ అవ్వడంతో షూటింగ్ జరుగుతోంది.

    అయితే ఈ విషయమై ఏపి ఫిల్మ్ ఎంప్లాయీస్ యూనియన్ మండిపడుతోంది. తేజపై బ్యాన్ పెట్టాల్సిందేనని పట్టుపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు వాళ్లు 24 క్రాప్ట్ లకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. తేజకు ఏ విధంగానూ మిగతా డిపార్టమెంట్ ల వాళ్లు సహకరించకూదని అందులో ఉన్నట్లు చెప్పుతున్నారు.

    English summary
    Around 20 members of the AP Film Employees Union entered Teja's upcoming film ‘Hora Hori’ sets and stalled the shooting until the police intervened.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X