twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేజ ‘నీకు నాకు డాష్ డాష్’ కథేంటి?

    By Srikanya
    |

    Neku Naaku Dash Dash
    అంతా కొత్త తారలతో వి.ఆనందప్రసాద్ నిర్మాణతలో తేజ రూపొందించిన 'నీకు నాకు డాష్ డాష్' ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం కథ ప్రకారం మద్యం సిండికేట్‌లో పనిచేసే హీరో హీరోయిన్లు ఓ తప్పు చేస్తారు. దానివల్ల సమస్యలో చిక్కుకొని, దాన్నుంచి బయటపడ్డం కోసం మరో తప్పు చేస్తారు. ఆ తర్వాత బలవంతంగా ఇంకో పెద్ద తప్పు చేస్తారు. దాంతో మద్యం సిండికేట్ మొత్తం వాళ్ల వెంట పడుతుంది. ఈ నేఫద్యంలో వారి ప్రేమ కథ ఏ మలుపు తీసుకుందనేది ధ్రిల్లంగ్ గా తేజ తీర్చి దిద్దారు.


    ఇక ఈ సినిమాలో మా హీరోయిన్ ఊతపదం 'డాష్'. అందుకే టైటిల్ అలా పెట్టాం. ఒకే సన్నివేశంలో ద్విముఖాలుగా భావోద్వేగాలను పండిస్తూ కొత్త తరహాలో స్క్రీన్‌ప్లే చేశాను అంటున్నారు దర్శకుడు తేజ. ఈ స్క్రీన్ ప్లే పద్ధతి కనుక ప్రేక్షకులకు నచ్చితే కచ్చితంగా తెలుగు సినిమాల్లో సరికొత్త మార్పులొస్తాయి అంటున్నారు తేజ. అలాగే ఈ సినిమాతో కొత్త స్టయిల్ సృష్టించా. థ్రిల్లర్‌లో కామెడీ పెట్టా. సినిమా సక్సెస్ అయితే ఈ తరహా కథనాల్ని దర్శకులు కంటిన్యూ చేస్తారనుకుంటున్నా అని చెప్పారు తేజ. నూతన తారలు ప్రిన్స్, నందిత జంటగా రూపొందిన 'నీకు నాకు డాష్ డాష్'కు ఆయన దర్శకుడు.

    ఇక మద్యం సిండికేట్ నేపథ్యం ఫేక్ లిక్కర్ సిండికేట్ నేపథ్యంలో ఈ సినిమా తీశా. దీనివెనుక ఎలాంటి ప్రేరణా లేదు. ఓ సారి వచ్చిన ఆలోచనతో ఆ నేపథ్యం తీసుకున్నా. నిర్మాత సహా చాలామంది ఆ నేపథ్యం వద్దన్నారు. అది జనానికి తెలియనిది కాబట్టి ఎవరికీ అర్థం కాదన్నారు. ఎవరు ఏది వద్దంటే అదే చేసే మనస్తత్వం కాబట్టి సినిమా తీసేశా. నేను తీశాక మద్యం సిండికేట్ కుంభకోణాలు హెడ్‌లైన్స్‌లోకి వచ్చాయి. ఇందులో ఏడుగురు విలన్లు. ఇప్పటిదాకా సాఫ్టరోల్స్‌లో కనిపిస్తూ వచ్చిన పరుచూరి వెంకటేశ్వరరావు ఇందులో ఓ విలన్‌గా కనిపిస్తారు. మరో నెగటివ్ రోల్‌లో తీర్థ గొప్పగా చేసింది.

    ఈ సినిమా కోసం 'రెడ్ ఎపిక్' అనే అత్యాధునిక డిజిటల్ కెమెరా వాడాం. ఆసియాలోనే ఈ కెమెరా వాడిన తొలి సినిమా మాదే అవుతుంది. 5కె రిజల్యూషన్‌తో క్వాలిటీ బావుంటుంది. మా హీరో, హీరోయిన్ ఇద్దరూ బాగా చేశారు. నాకు స్టార్లతో సినిమా చేయడం చేతకాదు. మన స్టార్లను నేను హేండిల్ చేయలేను. ప్రేక్షకులు సినిమా ఇలాగే చూస్తారని ఫిలిమ్‌నగర్‌లోని పండితులే డిసైడ్ చేసేస్తున్నారు అన్నారు తేజ. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన ఆ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది.

    English summary
    "Neeku Naaku Dash Dash" is an action packed love story set in the backdrop of liquor syndicates. It is a typical commercial entertainer loaded with action, emotion, drama, adventure and entertainment. Teja have tried something that has never been tried before in Telugu cinema and he confident that it will strike a chord with the audiences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X