‘నీకు నాకు డాష్ డాష్’ అంటూ మొదలెట్టిన తేజ

By Bojja Kumar

Teja's new film 'Neeku Naaku Dash Dash'
చిత్రం, జయం, నువ్వునేను సినిమాతో వెలుగులోకి వచ్చి, టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ చాలా కాలంగా సరైన హిట్లు లేక చాలా వెనక బడి పోయారు. విభిన్న శైలిలో ఆలోచించటం, కొత్త వారిని ప్రోత్సహిండం, వినూత్నంగా చిత్రకథను తెరకెక్కించే ఈ దర్శకుడు తన తాజా చిత్రం 'నీకు నాకు డాష్ డాష్'కు స్టోరీ మ్యాప్ కు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కు నూతననటీనటులు పరిచయం అవుతున్నారు. ఆనందప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. కొత్త నటులకు సన్నివేశాలను వివరిచేందుకు మ్యాప్ ను ఆవిష్కరించాడు దర్శకుడు. సన్నివేశం, నేపధ్యం, పాత్రధారులు చేయాల్సిన అంశాలను ఈ మ్యాప్ లో బొమ్మల రూపంలో ఉన్నాయి. దాంతో ఆ మ్యాప్ చూస్తే చేయాల్సిన సన్నివేశాలు ఈజీగా నటీనటులకు అర్థం అవుతుంది. నటీనటులు ఏం చేయాలనే విషయం ఈ విధానంతో స్పష్టంగా అర్ధం అయ్యేలా తేజ ఈ ప్రయత్నం చేశారు.

తర్వాత షెడ్యూల్ కోసం షెడ్యూల్ కోసం 'నీకు నాకు డాష్ డాష్" యూనిట్ అరకు వెళ్లనుంది. అక్కడ కొన్ని సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరించనున్నారు. మరి తేజ ఈ సారైనా తన ప్రాభవాన్ని నిలుపుకుంటారో? లేదో? అనే అంశం సినీ సర్క్యూట్లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రానికి సమర్పణ: వి.కృష్ణకుమారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X