twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజభోగాలు అనుభవించిన తేజ.. చివరకు ఫుట్‌పాత్‌పై పడుకునే దుస్థితి! తేజ గురించిన సంచలన నిజాలు

    |

    Recommended Video

    Director Teja Reveals His Real Life Problems During His Teenage || Filmibeat Telugu

    డైరెక్టర్ తేజ.. తెలుగు దర్శకుల్లోకెల్లా ఈయన స్టయిలే వేరు. తన సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా అస్సలు పట్టించుకోరు తేజ. తాను చెప్పాలనుకున్నది తెరపై ఏ మేర ఆవిష్కరించాను అనేదే ఆయన పాయింట్ తప్ప, దాన్ని రిసీవ్ చేసుకోవడంలో ప్రేక్షకుల టేస్ట్ ఎలా ఉంటుందో మనం ఉహిచలేముగా! అంటుంటాడు తేజ. ముక్కుసూటిగా మాట్లాడేయటం ఈయన లోని విలక్షణత.

    కాగా జీవితంలో కష్టాలు అనుభవిస్తూ కనీసం పూట ఎలాగడుస్తుందని బిక్కుబిక్కున చూసిన తేజ గురించి మనకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి. ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వాటిని స్వయంగా తేజనే చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..

    చిన్నప్పుడు రాజభోగాలు అనుభవించి ఆ తర్వాత

    చిన్నప్పుడు రాజభోగాలు అనుభవించి ఆ తర్వాత

    తేజ వాళ్ళ నాన్న బలరామకృష్ణది చెన్నైలో ఎక్స్‌పోర్ట్‌ వ్యాపారమట. అమ్మ రాణి వ్యాపార లావాదేవీలు చూసుకొనేవారట. తేజకు ఒక అక్క, చెల్లి ఉండేవారట. అమ్మానాన్న ఉన్న రోజుల్లో వారికి రాజభోగాలు ఉండేవట. స్కూల్‌కి కూడా కారులో వెళ్లేవారట. అయితే హఠాత్తుగా తేజ వాళ్ళ అమ్మ చనిపోయాక, నాన్న బాగా కుంగిపోయి.. వ్యాపారంలో నష్టమొచ్చి ఉన్న ఆస్తులన్నీ పోయాయట.

    చివరకు ముగ్గురిని బంధువులు తీసుకెళ్లారు

    చివరకు ముగ్గురిని బంధువులు తీసుకెళ్లారు

    తేజ కుటుంబ పరిస్థితులు చేయిదాటడంతో ఆయనను, అక్క, చెల్లిని బంధువులు ఒక్కొక్కరూ ఒక్కొక్కరినీ పంచుకునే స్థితికి వాళ్ళ జీవితం వెళ్లిపోయిందట. అత్త వాళ్లింట్లో తేజ అక్కయ్య అడ్జెస్ట్‌ అయి బతుకుతుండగా.. చెల్లి ఓ స్వచ్చంద సేవ సంస్థలో ఉండేదట. తాను మాత్రం బాబాయ్‌ వాళ్ల ఇంట్లో ఉండలేక బయటకి వచ్చేశాడట. ఇక అప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు చూస్తే కన్నీళ్లు ఆగవు.

    పూట ఎలా గడుస్తుందో అని బిక్కుబిక్కుమంటూ

    పూట ఎలా గడుస్తుందో అని బిక్కుబిక్కుమంటూ

    ఒకానొక సందర్భంలో బతకడానికి డబ్బులు లేక హోటల్ లో క్లీనింగ్‌ దగ్గరి నుంచి లారీ క్లీనర్‌గా, ఆఫీసుల్లో టీ ఇచ్చే వరకూ అన్నిపనులు చేశాడట తేజ. కేవలం ఓ బ్రెడ్డు ముక్కను నీళ్లలో అద్దుకొని తిన్న రోజులున్నాయట ఆయన జీవితంలో. ప్రతిరోజూ ఈ పూట ఎలా గడుస్తుందో అని ఎదురు చూసిన సందర్భాలు ఆయన జీవితంలో కోకొల్లలుగా ఉన్నాయట. ఈ విషయాలను స్వయంగా తేజనే వెల్లడించారు.

    ఒక ప్యాంటు, రెండు చొక్కాలతో కాలం వెళ్లదీస్తూ

    ఒక ప్యాంటు, రెండు చొక్కాలతో కాలం వెళ్లదీస్తూ

    మెల్ల మెల్లగా సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పని దొరకబట్టుకున్నారట తేజ. అప్పుడు తేజ దగ్గర ఒకే ఒక్క ప్యాంటు, రెండు చొక్కాలు మాత్రమే ఉండేవట. వీధి కొళాయి దగ్గర స్నానం చేసి షర్ట్‌ పిండుకొని ఆరేసుకొని అదే అవే బట్టలు తిరిగి ధరించేవాడట తేజ. ప్రొడక్షన్‌ వాహనం వచ్చినప్పుడు ఒక పెద్ద ఇంటి దగ్గర నిలబడి బండి ఎక్కేవాడట. తనకు ఇల్లే లేదంటే వారు గౌరవించరని అలా చేసేవాడట తేజ. దుప్పట్లు కూడా లేకుండా ఏ ఫ్లాట్‌ఫామ్‌ మీదో పడుకొని నిద్రపోయే వాడట తేజ. ఈ సంగతులన్నీ తేజనే స్వయంగా చెప్పుకురావడం విశేషం.

    పిల్లను కూడా ఇవ్వనన్నారు

    పిల్లను కూడా ఇవ్వనన్నారు

    ''మా చెల్లికి తెలిసిన అమ్మాయే శ్రీవల్లి. తనతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాక... వాళ్లింట్లో వాళ్లు కుదరదన్నారు. ఆ సమయంలో నేను ‘రాత్రి' సినిమాకు పని చేస్తున్నా. 'ఇతని సినిమా ఇంకా రిలీజ్‌ కానే లేదు. పైగా కుటుంబం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో మా అమ్మాయిని ఇవ్వలేం' అన్నారు. అప్పుడు అక్కినేని వెంకట్‌ గారి భార్య జ్యోత్స్న గారు వెళ్లి శ్రీవల్లి వాళ్లింట్లో ఒప్పించడం జరిగింది. అలా అలా నా ప్రయాణం ఇక్కడి దాకా సాగింది'' అని తేజ చెప్పుకొచ్చారు.

    నమ్మలేని నిజాలు.. మరీ ఇంత దారుణమైన పరిస్థితా?

    నమ్మలేని నిజాలు.. మరీ ఇంత దారుణమైన పరిస్థితా?

    వీటితో పాటు ఇంకా తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో విపత్కర పరిస్థితుల గురించి వివరించారు తేజ. దీంతో నేడు టాప్ దర్శకుడిగా వెలుగొందుతున్న తేజ జీవితంలో ఇన్ని నమ్మలేని నిజాలున్నాయా అని ఆశ్చర్యపోతున్నారు జనం. ఏదిఏమైనా ఇంత దారుణమైన పరిస్థితి నుంచి కోలుకొని ఈ రోజు ఈ పొజీషన్ లో ఉన్నారంటే తేజ ఆత్మస్తైర్యానికి హాట్సాఫ్ చెప్పాల్సిందే.

    English summary
    Director Teja's says about his childhood life and his joueney in to the direction field. In latest interview he said..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X