‘1000 అబద్దాలు’ షురూ చేసిన తేజ
హైదరాబాద్ : తేజ దర్శకత్వంలో సాయిరాం శంకర్ తొలిసారిగా నటిస్తున్న చిత్రం '1000 అబద్దాలు'. శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై పి. సునీత, ఎన్. సీతారామయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ వేడుక హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో నిరాడంబరంగా జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి తేజ కెమెరా స్విచాన్ చేయగా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం క్లాప్ ఇచ్చారు. ఏవీఎస్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'తేజ మార్క్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. సాయిరాం శంకర్ పాత్ర చిత్రీకరణ లవ్లీగా ఉంటుంది. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. రమణ గోగుల స్వరాలందిస్తున్నారు. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయి. నవంబర్ 9 నుంచి చిత్రీకరణ మొదలువుతుంది' అని తెలిపారు. ఈచిత్రానికి కెమెరా : రసూల్, సమర్పణ : హారిక, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీను బత్తుల.


Click it and Unblock the Notifications












