Hanu Man: మహేశ్ బాబుకు తేజ సజ్జా షాక్.. గుంటూరు కారం కంటే హనుమాన్‌కే ఎక్కువ
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో కొందరు యంగ్ డైరెక్టర్లు విభిన్నమైన సినిమాలతో వస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నారు. అందులో టాలెంటెడ్ గాయ్ ప్రశాంత్ వర్మ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ వైవిధ్యాన్ని చూపిస్తోన్న అతడు.. 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి విభిన్న తరహా ప్రయోగాత్మక సినిమాలను రూపొందించి విశేషమైన గుర్తింపును దక్కించుకున్నాడు.
వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు తేజ సజ్జా హీరోగా 'హనుమాన్' అనే సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. రియల్ సూపర్ హీరోగా పేరున్న హనుమంతుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధం చేసేశారు.

తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'హనుమాన్' చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నారు. దీంతో ఓవర్సీస్‌లో ఎప్పుడో బుకింగ్ ఓపెన్ అయ్యాయి. అలాగే, ఇండియాలోని చాలా ఏరియాల్లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే చాలా టికెట్లు కూడా సేల్ అయ్యాయి.
పాన్ ఇండియా రేంజ్‌లో విజువల్ వండర్‌గా రూపొందిన 'హనుమాన్' మూవీ వివరాలను ప్రముఖ టికెటింగ్ వెబ్‌సైట్ బుక్ మై షో చాలా రోజుల క్రితమే అందులో పొందుపరిచింది. దీంతో ఈ సినిమాపై ఎంతో మంది ఆసక్తిని తెలుపుతున్నారు. ఇలా తాజాగా ఈ మూవీ బుక్‌మైషోలో 220K ఆసక్తిని పొందింది. అంతేకాదు, మరిన్ని ఇంట్రెస్ట్‌లను అందుకుంటూ దూసుకుపోతోంది.
తాజాగా 'హనుమాన్' మూవీ ఓ గొప్ప రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు బుక్ మై షోలో 223.1K ఆసక్తిలను దాటేసింది. తద్వారా అత్యధిక ఇంట్రెస్ట్‌లను అందుకున్న సంక్రాంతి చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీ (220K)ని సైతం క్రాస్ చేసింది. అలా పెద్ద సినిమాకు సైతం షాక్ ఇచ్చేసింది.

ఇదిలా ఉండగా.. 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











