HanuMan Twitter Review: హనుమాన్‌కు అలాంటి టాక్.. ఆ సీన్స్ ఊహించని విధంగా.. ఇంతకీ మూవీ హిట్టేనా అంటే!
పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన చిన్న సినిమానే అయినా దేశ వ్యాప్తంగా హైప్‌ను క్రియేట్ చేసుకుంది హనుమాన్. తనదైన డిఫరెంట్ మూవీలతో దర్శకుడిగా విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని నిర్వహకులు పాన్ ఇండియా రేంజ్‌లో జనవరి 12న అంటే ఈరోజే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షోలూ ప్రదర్శితం అయ్యాయి. మరి 'హనుమాన్' మూవీ ట్విట్టర్ రివ్యూను మీరే చూడండి!
హనుమాన్‌గా వచ్చేసిన తేజ : తేజ సజ్జా హీరోగా నటించిన సినిమానే 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా చేశారు.

అలాంటి కథతో వచ్చేసింది : 'హనుమాన్' మూవీ రియల్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంతో రూపొందిన విషయం తెలిసిందే. ఓ సామాన్య కుర్రాడు కష్టాల్లో ఉండడం.. అతడిలోకి ఆంజనేయస్వామి శక్తులు ఆవహించడం.. అతడు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్లను ఎదురించడం అనే కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందింది. దీంతో దీనిపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
ఫస్టాఫ్ సూపర్‌గా ఉందంటూ : తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' మూవీని ఇప్పటికే ప్రదర్శించారు. దీన్ని చూసిన ఓ నెటిజన్ 'హనుమాన్ ఫస్టాఫ్ సూపర్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్ బ్రిలియంట్‌గా ఉన్నాయి. సూపర్ మ్యాన్ స్టోరీని చెప్పిన విధానం అద్భుతంగా ఉంది. పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు సినిమా అదరగొట్టేసింది. తేజ, వరలక్ష్మి యాక్టింగ్ బాగుంది. గెటప్ శ్రీను కామెడీ హైలైట్' అని చెప్పుకొచ్చారు.
వాళ్లు గుడి కట్టేస్తారు అంటూ : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన 'హనుమాన్' మూవీకి చూసిన ఇంకో నెటిజన్ 'క్లైమాక్స్ 30 నిమిషాలు చాలు సినిమాను రిపీట్ చేయొచ్చు. వీఎఫ్‌ఎక్స్‌తో పాటు కొన్ని షాట్స్ అయితే మెంటల్ స్టఫ్. బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్‌గా ఉంది. ప్రశాంత్ వర్మకు నార్త్‌లో పక్కా గుడి కట్టేస్తారు. తేజ సజ్జా రాముడికి హనుమంతుడిలా ఇద్దరూ ఇచ్చి పడేశారు' అని వివరించారు.
అరిచి అరిచి గొంతు పోయింది : ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' మూవీకి వీక్షించిన మరో నెటిజన్ 'అరిచి అరిచి గొంతు పోయింది. ఒక్కో సీన్ వస్తుంటే గూస్‌బమ్స్. ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండింగ్ వరకూ సీట్లో కూర్చుంటే ఒట్టు. అసలైంది ఏంటంటే థియేటర్ మొత్తం జై శ్రీరామ్ నినాదంతో మారుమ్రోగింది. ప్రశాంత్ వర్మకు చాలా పెద్ద థ్యాంక్స్' అని పేర్కొన్నారు.
సూపర్ హీరోకా బాప్ ఆగయా : 'హనుమాన్' మూవీని చూసిన ఇంకొక నెటిజన్ ఇలా స్పందించారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌లో 'ప్రశాంత్ వర్మ ఇండియన్ సినిమాలో ఓ పెద్ద విషయం కాబోతున్నాడు. తేజ సజ్జా నీ విభిన్నమైన కథల ఎంపిక.. నీ విలక్షణమైన నటనతో మంచి ఫ్యూచర్‌ను చూడబోతున్నావు. ఫైనల్లీ హనుమాన్ రాంపేజ్. ది సూపర్ హీరోకా బాప్ ఆగయా (వచ్చేశాడు)' అని రాసుకొచ్చారు.
ఇండియాలోనే గ్రేట్ మూవీ : తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన 'హనుమాన్' మూవీని చూసి మరొక నెటిజన్ 'ఇండియాలోనే వచ్చిన గ్రేటెస్ట్ సినిమాల్లో హనుమాన్ ఒకటి. మంచి సినిమాటిక్ అనుభూతిని కలిగించిన ప్రశాంత్ వర్మకు థ్యాంక్స్. జై హనుమాన్. ఆ బ్యాగ్రౌండ్ స్కోర్‌కు విజయవాడ థియేటర్లలో నాన్‌స్టాప్‌గా జై శ్రీరామ్ నినాదాలు వినిపించాయి' అని వెల్లడించారు.
ఓవరాల్‌గా ఎలా ఉందంటే : 'హనుమాన్' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్లను పరిశీలిస్తే.. ఈ చిత్రానికి ఓవరాల్‌గా పాజిటివ్ టాక్ వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులోని కొన్ని సన్నివేశాలను నెటిజన్లు హైలైట్ చేసి చెప్తున్నారు. అలాగే, క్లైమాక్స్ అద్భుతంగా ఉందని మాట్లాడుతున్నారు. ఇదే టాక్ కంటిన్యూ అయితే 'హనుమాన్' మూవీ హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











