సరికొత్తగా ఆలోచిస్తున్న తేజ.. తగ్గేదే లేదంటూ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
సాధారణంగా ఒక్కొక్కరిలో ఒక్కో విలక్షణత ఉంటుంది. ఆలోచనలు, పనుల్లో ఎవరికి వారు ప్రత్యేకం. అయితే తెలుగు దర్శకుల్లో అలాంటి విలక్షణత ఉన్న డైరెక్టర్ ఎవరంటే అది తేజనే అని చెప్పుకోవచ్చు. తన సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా ఏ మాత్రం పట్టించుకోకుండా లైట్ తీసుకొని నెక్స్ట్ ప్రాజెక్టు మొదలెట్టేయడం తేజ నైజం.
అప్పట్లో నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించిన తేజ విలక్షణ దర్శకుడిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు రాకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకొని దగ్గుబాటి రానా హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ట్రాక్ ఎక్కారు. ఆ సినిమా విజయం సాధించిన విజయం మరోసారి తేజ లోని టాలెంట్ బయటపెట్టింది. కానీ ఇటీవలే 'సీత' సినిమాతో డిసప్పాయింట్ అయ్యాడు తేజ. కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది.

దీంతో ఇక తేజ పరిస్థితి మళ్ళీ ఢమాల్ అనే టాక్ వచ్చింది జనాల్లో. అయితే అలాంటి నెగెటివ్ టాక్ అస్సలు పట్టించుకోకుండా తన నెక్స్ట్ సినిమా విషయమై క్లారిటీ ఇచ్చాడు తేజ. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. తన తదుపరి సినిమా కోసం ఓ విభిన్న కథాంశాన్ని రెడీ చేస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఈ కథకు సంబందించిన స్క్రిప్ట్ పనుల్లోనే నిమగ్నమై ఉన్నానని అన్నాడు. అయితే ఇది మల్టీస్టారర్ సినిమా అని తేజ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తేజ దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా అంటే హీరోహీరోయిన్లు ఎవరై ఉంటారు? కథ ఎలా ఉండబోతుంది? అనే ఆసక్తి మొదలైంది ప్రేక్షక లోకంలో. కాగా ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలపై తేజ స్పందించలేదు.


Click it and Unblock the Notifications











