ఎంఎస్ రాజు కుమారుడి సినిమా ప్రారంభం
దర్శకుడు తేజకు, నిర్మాత ఎంఎస్ రాజుకు ఒక విషయంలో సామ్యం ఉంది. వీరిద్దరూ తమ సినిమాలలో కొత్తవారికి అవకాశాలు ఇస్తుంటారు. అయితే ఇపుడు వీరిద్దరూ కలిశారు. ఎంఎస్ రాజు కుమారుడుని తెరకు పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో సినిమా రూపొందనున్నది. ఈ సినిమా శుక్రవారం ప్రారంభమయింది. ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ హీరోగా రూపొందనున్న ఈ సినిమా పేరు నువ్వే నా హీరో.
ఫ్రెష్ గా, క్యూట్ గా కనిపిస్తున్న సుమంత్ తో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను కూడా సినిమా ప్రారంభోత్సవంనాడే విడుదల చేశారు. ఇదంతా ఎంఎస్ రాజు కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ బ్యాన్నర్ పై ఎంఎస్ రాజు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











