బాలకృష్ణతో సినిమా అంటూ తేజ
నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయనతో ఎలా గూ తీయలేం. బాలకృష్ణతోనైనా సినిమా చేయాలనుంది అన్నారు డైరక్టర్ తేజ. ఓ పాపులర్ తెలుగు టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో భాగంగా ఆయన ఇలా స్పదించారు. అలాగే ...పెద్ద హీరోలతో చేయాలని ప్రయత్నించలేదు..లేదు. ఎందుకంటే మూసపద్ధతిలో చేయాలి. అది ఇష్టం లేదు అన్నారు. అలాగే ఆయన తన ఇంటి గొడవపై జరిగిన కోర్టు వివాదం గురించి కూడా వివరణ ఇచ్చారు.
ఇంటి వివాదం, కోర్టు కేసు విషయమై మాట్లాడుతూ...ఆ మధ్యన మా అబ్బాయి అనారోగ్యం పాలయ్యాడు. వైద్యం కోసం జర్మనీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి. నా దగ్గర డబ్బుల్లేవు. అప్పట్లో సినిమా తీయడానికి ఓ నిర్మాత దగ్గర రూ.కోటి తీసుకున్నా. మళ్లీ ఆయన్నే డబ్బడిగా. ష్యూరిటీ గా ఇల్లు రాసిమ్మన్నారు. రాసిచ్చినా ఇవ్వాల్సిన డబ్బివ్వలేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డా. చివరకు అబ్బాయిని కూడా కోల్పోయా. ఆ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ఆయనవల్లే మా అబ్బాయిని కోల్పోయాను అన్నారు.
అలాగే ఆ ఇంటి వివాదం విషయమై భానుని కలిసారా అన్నదానకి సమాధానంగా...భానుని అడుగుదామని ఎవరో చెప్పారు కానీ, కలవలేదు. పైగా నాకే చాలా బెదిరింపు ఫోన్లు వచ్చేవి అన్నారు. ఆయన తాజా చిత్రం నీకు నాకు డాష్ డాష్ చిత్రం టైటిల్ ని సగం కట్ చేసిన దానికి వివరణ ఇస్తూ..టైటిల్ లో అశ్లీలం ధ్వనిస్తోంది అని అనుకోలేదు. డ్యాష్‌డ్యాష్‌లో ప్రేమ, పెళ్లి అని ఊహిస్తారనుకున్నా. కానీ, ఎక్కువమంది బూతునే ఊహించుకున్నారు. అందుకే డ్యాష్ డ్యాష్ తీసేశాం అని చెప్పారు.
తన సినిమాల్లో నటులపై చేయి చేసుకుంటారని పేరు వచ్చిందన్న దానికి కారణం వివరిస్తూ...ఒక్కోసారి తప్పదండీ. అయినా తేజ కొడతాడు అని ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకున్నది నేనే. ఎందుకంటే సినిమా ల్లో నటించేయాలని నాదగ్గరకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. వారిలో ఓ భయం కలిగించాలంటే ఇటువంటిది తప్పదనిపించింది. అందుకే అలా.. అన్నారు. ఇక తన పూర్తి పేరు ధర్మతేజ అని...అందరూ తేజ అంటుండటంతో అదే స్థిరపడిపోయిందని అన్నారు. అలాగే నేను కుల వ్యవస్థకు వ్యతిరేకం. అందువల్ల ఇంటిపేరు వదిలేశాను. తమిళనాడులో పుట్టి పెరిగినందున నామీద డీఎంకే వంటి పార్టీల ప్రభావం ఎక్కువే అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











