బిగ్ బాస్ అసలు విజేతలు వీళ్ళే , కౌశల్ కాదు.. దుమారం రేపుతున్న తేజస్వి!
Recommended Video

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 ముగిసింది. కౌశల్ విజేతగా నిలిచాడు. కౌశల్ ఆర్మీ అండతో, తన ఒంటరి పోరాటంతో అనుకున్న లక్ష్యం సాధించాడు. కానీ హౌస్ సభ్యులలో మాత్రం కౌశల్ ఎక్కువమందికి శత్రువుగానే మిగిలిపోయాడు. బిగ్ బాస్ 2 సీజన్ మొత్తం గమనిస్తే కౌశల్ కు ఇతర ఇంటి సభ్యులకు మధ్య వాదోపవాదాలు ఎక్కువగా జరిగాయి. ఒకరకంగా చెప్పాలంటే కౌశల్ తో గొడవ ప్రారంభించిన మొదటి ఇంటి సభ్యురాలు తేజస్వి అని చెప్పొచ్చు. తేజస్వి ఉన్నన్ని రోజులు వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా వివాదాలు చోటు చేసుకున్నాయి. తాజగా తేజస్వి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదంగా మారింది.

బిగ్ బాస్ పూర్తయినా కూడా
బిగ్ బాస్ సీజన్ 2 నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. అయినా కూడా కౌశల్ పై తేజస్వి కోపం చల్లారినట్లు అనిపించడం లేదు. బిగ్ బాస్ 2 విజేతగా కౌశల్ నిలిచాడు. కానీ తేజస్వి తాన్ ఇంస్టాగ్రామ్ లో బిగ్ బాస్ విజేతలు వీళ్ళే అంటూకొందరి ఇంటి సభ్యుల ఫోటో పోస్ట్ చేసింది.

ఆ ఏడుగురు
తనతో పాటు ఏడుగురు ఇంటి సభ్యులు ఉన్న ఫోటోని తేజస్వి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అమిత్, పూజ, భానుశ్రీ, శ్యామల, రోల్ రైడ, గణేష్ ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది వీళ్ళే బిగ్ బాస్ విజేతలు అంటూ కామెంట్ పెట్టింది. దీనితో కౌశల్ మద్దత్తు దారులు తేజస్విని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

డైనింగ్ టేబుల్ వద్ద మొదలై
బిగ్ బాస్ లో తేజస్వి, కౌశల్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వివాదం జరిగింది. తొలి వారంలో డైనింగ్ టేబుల్ వద్ద మొదలైన వీళ్లిద్దరి గొడవ.. ఆపిల్ టాస్క్ తో తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

ఆపిల్ టాస్క్
ఆపిల్ టాస్క్ లో భానుశ్రీని కౌశల్ తాకారని చోట తాకడంతో తేజస్వి నన హంగామా చేసిన సంగతి తెలిసిందే. కౌశల్ క్యారెక్టర్ ని దూషించే ప్రయత్నం చేస్తుండడంతో గీత మాధురి అడ్డుకుంది. ఈ సంఘటనతో గీత మాధురిపై నాని ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఈర్షతో ఏడ్చి చావండి
తేజస్వి సోషల్ మీడియా పోస్ట్ లని కౌశల్ మద్దత్తు దారులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఆమె చీప్ గా ప్రవర్తిస్తోందని, కౌశల్ మీద ఈర్షతో రగిలిపోతున్నారని కామెంట్స్ పెడుతున్నారు.
ఎప్పటికీ మారరు
మరో నెటిజన్ కామెంట్ పెడుతూ కొంత మంది ఎప్పటికి మారరు అంటూ తేజస్వికి చురకలు అంటించాడు. కౌశల్ మద్దత్తు దారుల ఆగ్రహంతోనే తేజస్వి హౌస్ నుంచి త్వరగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











