»   » రామ్ గోపాల్ వర్మ కోసం హీరోయిన్ నగ్నావతారం!

రామ్ గోపాల్ వర్మ కోసం హీరోయిన్ నగ్నావతారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఫియర్ ఈజ్ హాట్' అనే క్యాప్షన్‌తో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా రూపొందిస్తున్న 'ఐస్ క్రీమ్'లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ఇప్పటికే అందరి దృష్టినీ అమితంగా ఆకర్షించిన వర్దమాన యువ కథానాయకి తేజస్వి.

హీరోయిన్‌గా తొలి సినిమా చేస్తున్న తేజస్వి మొదటి సినిమాలోనే గ్లామర్ పరంగా రెచ్చిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమ్మడు ఈచిత్రంలో ఓ సన్నివేశంలో లో దుస్తులు సైతం లేకుండా నగ్నంగా నటించడం ద్వారా టాలీవుడ్లో పెద్ద సంచలనానికి తెర తీసేందుకు రెడీ అవుతోంది.

'ఐస్ క్రీమ్' చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం తేజస్వి పూర్తి నగ్నంగా నటించింది. ఈ విషయాన్ని ఆ చిత్ర యూనిట్ వర్గాలు ధృవీకరించాయి.

మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

ఎవరూ లేకుండా న్యూడ్ సీన్

ఎవరూ లేకుండా న్యూడ్ సీన్

నగ్న సన్నివేశాన్ని చిత్రీకరించేటపుడు డైరెక్టర్, కెమెరామెన్ సహా యూనిట్ సభ్యులు ఎవరూ షూటింగ్ స్పాట్‌లో లేరు. నాలుగు గోడల నడుమ ఈ సీన్ తెరకెక్కించారు.

లోదుస్తులు సైతం లేకుండా

లోదుస్తులు సైతం లేకుండా

గది నాలుగు వైపులా కెమెరాలు అమర్చి, వాటిని రోల్ చేసి అందరూ దూరంగా వెళ్లి పోయిన తర్వాత తేజస్వి తన లో దుస్తులు సహా అన్నీ విప్పేసి నగ్నంగా నటించిందని సమాచారం.

సెన్సార్ ఎలా?

సెన్సార్ ఎలా?

మరి ఆ సన్నివేశాన్ని ‘ఐస్ క్రీమ్' సినిమాలో సెన్సార్ కత్తెరకు దొరకకుండా రామ్ గోపాల్ వర్మ ఎలా ప్రజెంట్ చేసి ఉంటాడనేది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్.

ఐస్ క్రీమ్

ఐస్ క్రీమ్

నవదీప్-తేజస్వి జంటగా ‘కమింగ్ టు బర్న్ యు' అంటూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని ‘భీమవరం టాకీస్' పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈచిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Tejaswi Madivada who acted as Samantha's friend in Manam movie is acting as the heroine in the RGV's latest directorial venture Ice Cream. It is said that she acted full nude for a crucial scene of the movie. It is said that the movie unit are not present at the spot while filming this scene.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu