లాక్‌డౌన్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. బయటపెట్టిన తేజస్వి మదివాడ
కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ హీరోయిన్ అనిషా అంబ్రోస్ అభిమానులకు శుభవార్తను చెప్పింది. ప్రస్తుతం అనిషా ఐదు నెలల గర్బవతి. అనిషా గర్బంపై భర్త ముద్దు పెడుతున్న ఫోటో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. అనిషా గర్బవతి అనే విషయాన్ని ప్రపంచానికి మరో హీరోయిన్ తేజస్వి మదివాడ లీక్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే

తేజస్వి, అనిషా క్లోజ్‌ఫ్రెండ్స్
టాలీవుడ్‌లో అనిషా అంబ్రోస్, తేజస్వి మదివాడ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. వారిద్దరు మధ్య మంచి అనుబంధం ఉంది. సాధారణంగా హీరోయిన్ల మధ్య ఉంటే ఇగోలు ఈ ఇద్దరి మధ్య కనిపించవు. అందుకే తన స్నేహితురాలికి సంబంధించిన వార్తను తేజస్వి తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా బయటపెట్టింది.

అనిషా వివాహం వ్యాపారవేత్తతో
ఇక అనిషా అంబ్రోస్ వివాహం హైదరాబాద్‌కు చెందిన గుణ జక్కా అనే వ్యాపారవేత్తతో గతేడాది జరిగింది. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య బంధంలోకి మరో చిన్నారి త్వరలోనే ప్రవేశించనున్నారు. ఆగస్టు మాసంలో అనిషా అంబ్రోస్ ప్రసవం జరుగనున్నది. ఈ విషయాన్ని తేజస్వి మదివాడ తన ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసింది.

ప్రెగ్నెన్సీపై అనిషా స్పందిస్తూ..
తన ప్రెగ్నెన్సీపై అనిషా అంబ్రోస్ స్పందిస్తూ.. వాస్తవానికి నా ప్రెగ్నెన్సీ విషయాన్ని లై ప్రొఫైల్ ఉంచాలని అనుకొన్నాను. నా ప్రైవేట్ అకౌంట్‌లో ఫోటోలు చూసిన తేజస్వి మదివాడ చాలా ఎక్సైట్ అయ్యింది. వెంటనే వాటిని తన అకౌంట్‌లో పోస్టు చేసింది. దాంతో నా ప్రెగ్నెన్సీ విషయం బయటకు తెలిసింది. అప్పటి నుంచి నాకు స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు అని అనిషా అంబ్రోస్ పేర్కొన్నారు.

ఆగస్టులోనే.. నా బర్త్ డే నెలలో
ఆగస్టులో నా బర్త్ డే. అదే నెలలో నాకు బిడ్డ పుట్ట బోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లాక్‌డౌన్ సమయంలో ప్రెగ్నెన్సీ రావడం చాలా హ్యాపీగా ఉంది. గత మూడు వారాల క్రితం వరకు నేను చాలా బిజీగా ఉన్నాను. గృహ నిర్భంధం నాకు కలిసి వచ్చింది. నా భర్తతో నేను పూర్తిస్థాయిలో గడుపుతున్నాను. ఇలాంటి సమయంలో నాకు భర్త తోడుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. మా మధ్య మరింత అవగాహన పెరిగింది అని అనిషా అంబ్రోస్ తెలిపారు.
Recommended Video

అనిషా కెరీర్ గురించి..
అనిషా అంబ్రోస్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ఈ నగరానికి ఏమైంది, సెవెన్ సినిమాల్లో నటించింది. మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా, అనిషా ఎంగేజ్‌మెంట్ డిసెంబర్ 2018లో జరుగగా, మే 31, 2019లో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆగస్టులో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్దమైంది.


Click it and Unblock the Notifications











