ఆ మరణంతో ఒంటరినయ్యా, అందుకే సామ్రాట్‌తో రిలేషన్.. అన్యాయం జరిగింది.. తేజస్వి
తెలుగు బిగ్‌బాస్‌లో తేజస్వి మదివాడ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఇంటిలో బలమైన అభ్యర్థి అనే ఫీలింగ్‌ను క్రియేట్ చేయడంలో తేజస్వి సఫలమైంది. కానీ కొన్ని వివాదాల్లో కూరుకుపోవడం, స్వయంకృపారాధం వల్ల మరికొంత ఆమెను బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేలా చేశాయి. టైటిల్ గెలిచి వస్తుందనుకొన్న తేజస్వి ఆరంభంలోనే బయటకు రావడం ప్రేక్షకులను షాక్ గురిచేశాయి. తాజాగా తేజస్వి మీడియాతో మాట్లాడుతూ.. సామ్రాట్ సన్నిహిత రిలేషన్స్, బిగ్‌బాస్, తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు. ఆమె ఏమి చెప్పారంటే..

సరిగా అర్థం కాలేదు
బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా నడుచుకోవాలో నాకు సరిగా అర్థం కాలేదు. నేను ఎలా ఉంటానో అలానే ఉన్నాను. అందరితో కలిసిపోయాను. ఎవరి గేమ్ వారు ఆడుతుండటంతో అభిప్రాయ బేధాలు తలెత్తాయి. గేమ్ ఆడకుండా నేను అందరితో మంచిగా ఉండాలనుకోవడం తప్పని తెలిసింది అని తేజస్వి అన్నారు.

బిగ్‌బాస్ ఇంటిలో గందరగోళం
బిగ్‌బాస్ ఇంటిలో చాలా గందరగోళం ఉంటుంది. ప్రతీ క్షణం కెమెరాలు గమనిస్తుంటాయి. లోపల జరిగే ప్రతీ విషయం బయటకు తెలుస్తుందనుకొంటాం. కానీ కేవలం 45 నిమిషాలు మాత్రమే చూపిస్తారనేది బయటకు వచ్చినాకే తెలిసింది. రేటింగ్‌ను దృష్టిలో పెట్టుకొని సీన్లను ఎడిట్ చేస్తున్నారు. అందులో భాగంగానే నేను అరిచేవే చూపించారు. దాంతో నాపై చెడు అభిప్రాయం ఏర్పడింది.

సామ్రాట్‌తో రిలేషన్
సామ్రాట్‌తో రిలేషన్ బిగ్‌బాస్‌లో ఓ వివాదంగా మారింది. సామ్రాట్ నాకు 8 సంవత్సరాల క్రితమే పరిచయం. అప్పటికే ఆయనకు పెళ్లి జరిగింది. సామ్రాట్‌కు, ఆయన భార్యకు వ్యక్తిగత భేదాలు రావడంతో పెళ్లి సమస్యల్లో పడిందనే విషయం హౌస్‌లోనే తెలుసుకొన్నాను. సామ్రాట్ చాలా ఓపెన్‌గా ఉంటాడు. అందుకే మా మధ్య మంచి బంధం ఏర్పడింది.

క్లోజ్‌గా ఉంటే తప్పా
ఒక అమ్మాయి, అబ్బాయి క్లోజ్‌గా ఉంటే తప్పా.. అది నా వ్యక్తిగతం. దానికే సోషల్ మీడియాలో బూతులు తిడతారా? అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తారా? నాపై ఏ విధంగా బూతులు వాడారో బయటకు వచ్చిన తర్వాతే తెలిసింది. ట్రోలింగ్స్‌తో చాలా మానసిక వేదనను అనుభవించా. చాలా కుంగిపోయాను అని తేజస్వి చెప్పింది.

అమ్మను పొగొట్టుకొన్నాను
నా బాల్యంలోనే అమ్మను పొగొట్టుకొన్నాను. నాన్న మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో పరిస్థితులను తట్టుకోలేక 17 ఏళ్ల వయసులోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను. అందుకే ఇంట్లో ఎలా ఉండాలో తెలియలేదు. అదే నాకు మైనస్‌గా మారింది.

బిగ్‌బాస్‌లో అప్పుడే అవకాశం
నాకు బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్‌లోనే అవకాశం వచ్చింది. కొన్ని ప్రాజెక్టుల కారణంగా కుదర్లేదు. ఇటీవల మా అవార్డుల కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బిగ్‌బాస్2లో అవకాశం వచ్చింది. ఇంట్లోకి వెళ్లాకే నాకు ఎవరెవరు వచ్చారో తెలిసింది.


Click it and Unblock the Notifications











