కళ్లు మూస్తే కలలోకి.. మొత్తం హీరో గురించే.. అలాంటి సమస్య వేధిస్తోంది.. తేజస్వి

టాలీవుడ్ హీరోయిన్ తేజస్వి మదివాడ లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. డ్యాన్సులు, వంటలు, ఫోటోషూట్‌తో కాలం వెళ్లదీస్తూనే అప్పుడు అసంతృప్తిని వెళ్లదీస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా చాలా మంది సన్నిహితులను, కుటుంబ సభ్యులకు దూరమయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలో తల్లికి దూరమైన ఆమె తన బాల్యం, అమ్మ ప్రేమను గుర్తు చూసుకొంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకొన్నారు. తేజస్వి ఆవేదన ఏమిటంటే..

వంటలతో బిజీగా మారిన తేజస్వి

వంటలతో బిజీగా మారిన తేజస్వి

లాక్‌డౌన్ పిరియడ్‌లో ఇంటికే పరిమితమైన తేజస్వి కిచెన్‌లోకి దూరి చేతికి పనిచెబుతున్నారు. ఇటీవల తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకొనేలా వంట చేశారు. అరటిపండు, పాలు, తేనె కలిపిన ఓ రుచికరమైన వంటను చేశారు. బాల్యంలో నాకు నా తల్లి ఇది కమ్మగా చేసే పెట్టేవారు అంటూ తేజస్వి గుర్తు చేసుకొన్నారు. అలాగే ఇంట్లోనే ఉండటం కారణంగా సమయం సందర్భం లేకుండా నిద్రపోవడం కూడా అనేక సమస్యలకు గురిచేస్తుందన్నారు.

 నిద్ర సమయాలు మారిపోయాయి..

నిద్ర సమయాలు మారిపోయాయి..

ఇంట్లోనే ఉండటం కారణంగా ప్రతీ ఒక్కరి నిద్ర వేళలు మారిపోయాయి. ఎప్పుడు పడుకొంటున్నామో.. ఎలా తింటున్నామనే విషయం క్రమం తప్పింది. రాత్రిళ్లు నిద్ర పట్టడం ఓ సమస్యగా మారింది. నిద్ర వేళలు మారిపోవడమే ఇందుకు సమస్యగా మారింది. పని లేకపోవడం, ఫ్రెష్‌గా కనిపించే అవకాశం లేకపోవడం వల్ల అలసత్వం పెరిగిపోతున్నది అని తేజస్వి పేర్కొన్నారు.

నెగిటివ్ ఆలోచనలకు దూరంగా

నెగిటివ్ ఆలోచనలకు దూరంగా

లాక్‌డౌన్‌లో ఎక్కువ కాలం ఉండటం వల్లనేమో అంతా నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతున్నాయి. రెండు మూడు రోజులుగా ప్రతికూలమైన భావనలు పెరిగిపోతున్నాయి. ప్రతీ ఒక్కరు తమ కుటుంబాల ఫోటోలు షేర్ చేస్తుంటే నాకు నిరాశ పెరిగిపోతున్నది. మా అమ్మను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ పెరిగిపోతున్నది. కళ్లు మూస్తే ఆమె కలలోకి వస్తున్నారు. ఎవరో ఓ గురించి మాట్లాడుతున్నారు. కళ్లు తెరిస్తే ఏం జరిగిందో గుర్తుకు రావడం లేదు. అందుకే ఎక్కువగా అమ్మతో ఉన్నానే ఫీలింగ్ కలుగడానికి నిద్రలోనే ఉంటున్నాను అని తేజస్వి చెప్పారు.

 నిరాశ, నిస్పృహలకు దూరంగా

నిరాశ, నిస్పృహలకు దూరంగా

నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న తాను ఆ వాతావరణం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. పాజిటివ్ ఆలోచనలను పెంచుకొంటున్నాను. అందుకే న్యూస్ చదవడం ఆపేశాను. పాజిటివ్ ఫీలింగ్ కలిగించే సినిమాలు, వెబ్ సిరీస్‌లను మాత్రమే చూస్తన్నాను. నీ మెదడుకు ఎలాంటి మేత పెడితే అలాంటి ఆలోచనలు వస్తాయని నాకు తెలుసు. అందుకే నెగిటివ్‌ను అంతా తుడిచేస్తున్నాను అని తేజస్వి వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X