కౌశల్‌ను మీరే కొడ్తారు.. అతనితో గొడవనా? సామ్రాట్ కోసం.. వాళ్లను తిట్టాను.. తేజస్వి

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 44 Highlights

బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తేజస్వి మదివాడ తనపై వస్తున్న ఆరోపణలపై ఫేస్‌బుక్ లైవ్‌లో స్పందించారు. తనపై సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లపై విచారం వ్యక్తం చేశారు. తనకు కౌశల్‌కు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేశారు. ఇంట్లో జరిగే విషయాలు బయట వ్యక్తులకు అసలే తెలియదు. చూపించే కొన్ని సన్నివేశాలను బేరీజు వేసుకొని తనపై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆమె సూచించారు. ఫేస్‌లైవ్ తేజస్వి మాట్లాడుతూ..

కౌశల్‌ను మీరే కొడ్తారు..

కౌశల్‌ను మీరే కొడ్తారు..

బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చి చూస్తే కౌశల్‌ను మీరే కొడుతారు. అర్ధరాత్రి లేచి కౌశల్ భోజనం చేస్తుంటాడు. దాని వల్ల ఎవరికి తిండి సరిపోదు. అతడు ప్రవర్తించే విధానం సరిగా ఉండదు. రోజంతా ఏమి చేస్తాడో మీకు తెలియదు. ఓ గంట సేపు ఎపిసోడ్ చూసి నన్ను ద్వేషిస్తారా అని తేజస్వి అన్నారు.

కౌశల్‌తో వార్ లేదు..

కౌశల్‌తో వార్ లేదు..

కౌశల్‌తో నాకు మధ్య వార్ లేదు. నేను వచ్చేటప్పుడు అతడికి సారీ చెప్పాను. మాటల్లో ప్రేమను పంచాను. అవన్నీ చూపించలేదు. నేను చెప్పిన నెగిటివ్ మాటను మాత్రమే చూపించారు. అసలు చూసిస్తే నా మీద ఇంత ద్వేషం ఉండేది కాదేమో. సామ్రాట్ మంచి వ్యక్తి. అందుకే ఆయనకు చేరువయ్యాను. తనీష్ కూడా చాలా మంచివాడు అని చెప్పారు.

నన్ను చూపించింది 10 నిమిషాలే

నన్ను చూపించింది 10 నిమిషాలే

బిగ్‌బాస్ ఇంట్లో నా అరుపులు, నా ఏడుపులు పక్కన పెడితే నేనేంటో అర్ధమవుతుంది. 24 గంటల్లో నన్ను చూపించింది కేవలం 10 నిమిషాలే. దాంతో నా గురించి ఓ నిర్ణయం తీసుకోవద్దు. నాతో ఇంట్లో వాళ్లు మంచిగా ఉన్నారు. కానీ నా వెనుక ఏం మాట్లాడుతారో అర్థం కాలేదు.

సామ్రాట్ గురించి అసలే చూపించలేదు

సామ్రాట్ గురించి అసలే చూపించలేదు

సామ్రాట్ గురించి చూపించడం లేదు. నేను తిట్టిందే చూపించి నన్ను బ్యాడ్ చేశారు. మా టీవీ వాళ్లను కూడా కోప్పడ్డాను. నేను అదోలా ప్రవర్తిస్తే.. అలా ఎందుకు చేశానో ఆలోచించండి. నేను మళ్లీ ఇంట్లోకి అడుగుపెట్టాలనుకొంటున్నాను. నేనేంటో రుజువు చేసుకోవాలంటే మళ్లీ బిగ్‌బాస్‌లోకి వెళ్లాల్సిందే. ఈ రోజు పెట్టే ఓటింగ్‌లో మళ్లీ ఓటు వేసి నన్ను ఇంట్లోకి పంపించండి.

తిట్టినా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా

నన్ను తిట్టుకొంటే నేను పట్టించుకోను. నన్ను తిట్టినా, తిట్టకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను మళ్లీ హౌస్‌లోకి పంపించి నాకు మద్దతుగా నిలువండి. సినీ పరిశ్రమలో పైకి రావాలన్నా.. నా జీవితంలో మంచిగా ఉండాలన్న ఆడియెన్స్ సపోర్ట్ ఉండాలని కోరుకొంటాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X