Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సామ్రాట్‌తో పెళ్లెపుడని.. ట్రోల్స్ లైట్ తీసుకొన్నా.. నాది ఒంటరి జీవితం.. తేజస్వి
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో రెండో సీజన్లో టైటిల్ గెలుస్తారనుకొన్న తేజస్వి మదివాడ అర్ధాంతరంగా బయటకు రావడం బుల్లితెర ప్రేక్షకులను షాక్ గురి చేసింది. ప్రారంభంలో తన సహజసిద్ధమైన ధోరణితో ఆకట్టుకొన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో పార్టిసిపెంట్ సామ్రాట్‌కు దగ్గరైన తర్వాత తన నేచర్‌కు విరుద్దంగా వ్యవహరించింది. దాంతో బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇంటి సభ్యుల గురించి, తన వ్యక్తిగత అనుభవాలను వివరించింది.
ప్రపంచంతో సంబంధం లేకుండా
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండటం ఓ సవాల్‌తో కూడినదే. ఇంట్లో ఎప్పుడు ఏది కావాలిస్తే అది తినే తనకు బిగ్‌బాస్‌లో సగం ఆకలి, సగం నిద్రతో గడిపేస్తానని కలలో కూడా అనుకోలేదు.
Recommended Video
ఫోన్ కోసం వెతికే దానిని
బిగ్‌బాస్‌లో ఏదైన జరిగితే వెంటనే షేర్ చేసుకొందామని ఫోన్ కోసం వెతికేదానిని. అలా చాలాసార్లు ఫోన్ కోసం వెతికి ఆ తర్వాత నేను ఎక్కడ ఉన్నానో గుర్తొచ్చి నాకు నేనే నవ్వుకొన్నాను. నా జీవితంలో చేయని పనులను బిగ్‌బాస్‌లో చేశాను. బటలు ఉతికాను. నేను చేసిన వంటను అందరూ మెచ్చుకోవడం నాకు బాగా నచ్చింది.
నాది ఒంటరి జీవితమే
చిన్నతనం నుంచి నాది ఒంటరి జీవితమే. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత టీమ్ వర్క్ అంటే ఏమిటో తెలిసింది. సమస్య వస్తే సభ్యులందరు కలిసి ఎలా సాల్వ్ చేసుకోవాలో నేర్చుకొన్నాను. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ అధిపత్యం చెలాయించాలి అనే విషయం హౌస్‌లో తెలిసింది.
అలా ఆటపట్టించారు
బిగ్‌బాస్ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ నా కంటే ఎక్కువగా బాధపడ్డారు. టైటిల్ గెలిచి వస్తావనుకొంటే మధ్యలోనే వచ్చేశావు అని ఆటపట్టించారు. కానీ నా ఫ్రెండ్స్ సపోర్టివ్‌గా నిలిచారు. బిగ్‌బాస్ అనేది గేమ్. ఆ ఇంట్లో జరిగే సంఘటనల ఆధారంగా రాత మారిపోతుంది అని తేజస్వి అన్నారు.
నేను చాలా స్ట్రాంగ్
మన సమాజం పురుషాధికార ప్రపంచం. వినోద రంగంలో ఇది మరీ ఎక్కువ. పురుషాధిక్యతను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని తెలుసుకొన్నారు. నేను మొదటి నుంచి చాలా స్రాంగ్. ఇక బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత సామ్రాట్‌తో పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. ఒక వ్యక్తితో క్లోజ్‌గా ఉంటే పెళ్లి చేయాలనుకొంటున్నారు అని తేజస్విని వెల్లడించింది.