twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగమ్మాయ్ తేజస్వి 'క‌మిట్‌మెంట్‌’.. బర్త్ డే రోజు బికినిలో బోల్డ్ షో..!

    |

    కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు మారుతుంటారు. అందులో హీరోయిన్స్ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు హీరోయిన్స్ లలో ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. గ్లామర్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కొంతమందికి చాలా ధైర్యంగా అడుగులు వేస్తుంటారు. తెలుగమ్మాయి తేజస్వి మదివాడ కూడా అదే తరహాలో షాకిస్తున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా బికినీ షోతో వెబ్ సిరీస్ కి సంబంధించిన లుక్ తో షాక్ ఇచ్చింది.

    అప్పట్లో హోమ్లీ లుక్..

    అప్పట్లో హోమ్లీ లుక్..

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హోమ్లీ లుక్ తో ఒక్కసారి అంటూ సింపుల్ గా కనిపించిన తేజస్వి ఆడియెన్స్ లో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే మెల్లమెల్లగా హీరోయిన్ అవ్వాలని అమ్మడు పూర్తిగా తన మార్గాన్ని మార్చుకుంది. గ్లామర్ షోకి ఏ మాత్రం ఇబ్బంది లేదని ఐస్ క్రీమ్ సినిమాతోనే చాలా క్లియర్ గా చెప్పేసింది.

    క‌మిట్‌మెంట్‌..

    క‌మిట్‌మెంట్‌..

    ఆ తరువాత రకరకాల సినిమాలు చేసినప్పటికీ సరైన క్రేజ్ ఎందుకో అందుకోలేదు. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ క‌మిట్‌మెంట్‌ అనే వెబ్ సిరీస్ తో రాబోతోంది. వెబ్ అంథాల‌జీ సిరీస్ గా రానున్న ‘క‌మిట్‌మెంట్‌' ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతొంది. ఇక నేడు తేజస్వి పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

    హాట్ లుక్ వైరల్..

    హాట్ లుక్ వైరల్..

    పోస్ట‌ర్‌లో తేజస్వి ఆల్ మోస్ట్ బికినీ రేంజ్ లో దర్శనమిచ్చింది. వయ్యారంగా పడుకొని ఒర కళ్ళతో కుర్రాళ్ళ మనసులను తనవైపుకు తిప్పుకుంటోంది. గతంలో చాలా సార్లు ఇంతకంటే హై రేంజ్ లో స్టిల్స్ ఇచ్చినప్పటికీ ఎందుకో ఈ సారి చాలా కొత్తగా అందంగా కనిపిస్తోందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    Recommended Video

    'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview
    ఆశలన్నీ ఆ వెబ్ సిరీస్ పైనే..

    ఆశలన్నీ ఆ వెబ్ సిరీస్ పైనే..

    ఇక ప్రస్తుతం రూపొందుతున్న కమిట్ మెంట్ వెబ్ సిరీస్ పైనే ఈ బ్యూటీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్ కూడా ఈ సిరీస్‌లో న‌టిస్తున్నారు. ఇక తేజస్వి గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా వర్కౌట్ కావడం లేదని కమిట్ మెంట్ సిరీస్ కోసం గ్లామర్ ప్రజెంటేషన్ లో డోస్ పెంచిందట. మరి తేజస్వి నమ్మకం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

    English summary
    Tejaswi, who appeared as a homely beauty in the svsc movie in Vakit. The cute girl who made a good impression on herself with the film, followed by the steps, shocked everyone. At first the glamor never crossed the line. Tejaswi madivada next in hot web series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X