ఆఖరుకి కృష్ణుడినీ వదలని తెలంగాణ సెగ..!!

By Kuladeep

ఇటీవలి కాలంలో హైదరాబాదులో షూటింగ్ జరపాలంటేనే సినిమా వాళ్లు భయపడుతున్నారట. కారణం తెలంగాణా వాదులు షూటింగ్ జరుగుతున్న పరిసరాల్లోకి చొచ్చుకువచ్చి ఆందోళన జరపుతుండటమే. ఇంతకు ముందు టాప్ హీరోలయిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, మరియు సునీల్, మంచు మనోజ్, గోపీచంద్ గోళీమార్ ల షూటింగులను అడ్డుకున్న తెలంగాణ వాదులు ఇప్పుడు చిన్న చిత్రాల కథానాయకుడు కృష్ణుడి సినిమా షూటింగుని కూడా అడ్డుకున్నారు.

ఆర్యన్ ఎంటర్టెయినర్స్ పతాకం పై కృష్ణుడు హీరోగా ప్రవీణ్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదు నగర పరిసరాల్లోని హయత్ నగర్ మండంలోని తట్టి అన్నారం గ్రామంలో జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్ కు చేరుకున్న తెలంగాణా వాదులు ఓ ఆంధ్రా హీరో షూటింగ్ ఇక్కడ జరగనివ్వం అని నినాదాలు చేస్తూ షూటింగును అడ్డుకొనే ప్రయత్నం చేసారు. కానీ కృష్ణుడు వారి కోరిక మేరకు అనడం కంటే ఒత్తిడి మేరకూ జై తెలంగాణా నినాదం చెయ్యడంతో వారు శాంతించారు. అంతా ముగిసిపోయాకా పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కబెట్టారు. కానీ ఇలా బలవంతంగా జై తెలంగాణా అనిపించినంత మాత్రానా తెలంగాణా వస్తుందా ఏంటి..?? పనీపాట లేనివారే ఇలా మీడియా దృష్టిలో పడాలని సినిమా వారితో తెలంగాణా నినాదాలు చేయిస్తున్నారని వినికిడి. ఏది ఏమైనా షూటింగును అడ్డుకొని వారిని బలవంతం చెయ్యడం ఆక్షేపనీయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X