తెలుగు ఫిలిం ఛాంబర్‌పై తెలంగాణవాదుల దాడి.. పైడి జయరాజ్‌ను అవమానించారంటూ ఆందోళన
తెలుగు ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణవాదులు భారీ సంఖ్యల చోచ్చుకుపోయి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ నటులు, దర్శకులు, రచయిత ఫోటోలు పెట్టడంలో ఎందుకు అలసత్వం, మాపై ఇంకా మీరు చిన్నచూపు చూస్తారా? అంటూ నిలదీశారు. ఊహించని విధంగా తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ కార్యాలయంలో గందరగోళం నెలకొన్నది. ఛాంబర్ నిర్వాహకులు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమ నాయకుడు పాశం యాదగిరి నేతృత్వం వహించారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా పాలకుల పెత్తనం మాకు వద్దనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్ సాగింది. వందలాది అమరుల త్యాగం ఫలితంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ కళాకారులకు తగిన గుర్తింపు లేదనే విమర్శలు గత కొద్దికాలంగా వినిపిస్తున్నాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడూ సద్దుమణిగేలా చర్యలు చేపడుతూ పాలకులు వస్తున్నారు.

తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 29వ) తేదీన పాశం యాదగిరి నేతృత్వంలో తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు తెలుగు ఫిలిం ఛాంబర్‌లోకి భారీగా చొచ్చుకుపోయారు. ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణకు చెందిన సినీ ప్రముఖుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ ఫోటోను చిన్నదిగా ఎందుకు పెట్టారు? సీ నారాయణరెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదు? డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదు? దాశరథి ఫోటో లేదేంది? అంటూ పాశం యాదగిరి నిలదీశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు విలువ ఇచ్చే సినిమాలు నిర్మించడం లేదు. ఈ ప్రాంతం కులాలను టార్గెట్ చేస్తూ విలన్‌లుగా చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతం భాషను కించపరిచే ఈ ప్రాంతం సినీ కళాకారుల ఫోటోలు పెట్టడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ ప్రాంతం సినీ కళాకారులను విస్మరిస్తున్నారు అంటూ ఫిలిం ఛాంబర్ కార్యాలయంలోకి దూసుకెళ్ల ప్రయత్నం చేశారు. దాంతో తోపులాట భారీగా జరిగింది. ఛాంబర్ అధికారులకు, తెలంగాణవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకేనా? తెలంగాణ కొట్లాడి తెచ్చుకొన్నది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే పాశం యాదగిరి నేతృత్వంలోని తెలంగాణ వాదుల నిరసన కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే వారిని పోలీస్ స్టేషన్‌కు రమ్మనమని చెబితే.. తాము వచ్చేది లేదు. కావాలంటే పోలీస్ ఉన్నతాధికారులను ఇక్కడికే రావాలని డిమాండ్ చేశారు. అయితే ఊహించని విధంగా ఇలాంటి సెగ తగలడంతో సినీ వర్గాల్లో విస్మయం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











