విద్యాబాలన్ డర్టీ పిక్చర్స్‌కు తెలంగాణ సెగ
బాలీవుడ్ మూవీ డర్టీ పిక్చర్స్‌కు తెలంగాణ సెగ తాకింది. విద్యాబాలన్ నటిస్తున్న డర్టీ పిక్చర్స్ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. తెలంగాణ బంద్ కారణంగా ఆ సినిమా షూటింగు ఆగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాణంలో జాప్యం జరుగుతూ వస్తోంది. రెండు రోజుల పాటు సినిమా ఆగిపోవడంతో నటీనటులు విద్యాబాలన్, నసిరుద్దీన్ షా, తుషార్ గొప్ప రిలీఫ్‌గా ఫీలయ్యారట. తెరిపి లేని షూటింగ్‌తో విసిగిపోయిన వారికి తెలంగాణ ఉద్యమం వల్ల ఆటవిడుపు లభించిందని అంటున్నారు.
కాగా, తమిళనటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా డర్టీ పిక్చర్స్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను విద్యాబాలన్ పోషిస్తోంది. స్మిత సెక్స్ బాంబుగా పేరు మోసింది. ఆమె సెక్సీ అపీల్‌తో ప్రేక్షకుల గుండెల్లో మదనతాపాన్ని రేపింది. అయితే, ఆమె జీవితం విషాదాంతమైంది.


Click it and Unblock the Notifications











